టీడీపీకి ఏమవుతోంది.. చంద్రబాబుకు ఎందుకీ దుస్థితి?

అన్న ఎన్టీఆర్‌‌ హయాం నుంచి టీడీపీకి ఉన్న క్రేజ్‌ మామూలుది కాదు. ఆ తర్వాత ఆ పార్టీ పగ్గాలు చంద్రబాబు చేతికి వచ్చినా ఇన్నాళ్లు ఎలాగోలా నెట్టుకొచ్చారు. కానీ.. ఈ మధ్య ఆ పార్టీ పరిస్థితి మాత్రం దినదినం గండంగా మారింది. తెలుగుదేశం పార్టీ అంటేనే క్యాడర్ బేస్డ్‌ పార్టీ అని చెప్పుతుంటారు. ఆ పార్టీకి కార్యకర్తలే రక్షణ కవచాలు. అందుకే.. నేతలు ఎంతమంది వెళ్లిపోయినా నాలుగు దశాబ్దాలుగా పార్టీ ఇంకా జీవిస్తూనే ఉంది. Also Read: […]

Written By: Srinivas, Updated On : March 6, 2021 10:41 am
Follow us on


అన్న ఎన్టీఆర్‌‌ హయాం నుంచి టీడీపీకి ఉన్న క్రేజ్‌ మామూలుది కాదు. ఆ తర్వాత ఆ పార్టీ పగ్గాలు చంద్రబాబు చేతికి వచ్చినా ఇన్నాళ్లు ఎలాగోలా నెట్టుకొచ్చారు. కానీ.. ఈ మధ్య ఆ పార్టీ పరిస్థితి మాత్రం దినదినం గండంగా మారింది. తెలుగుదేశం పార్టీ అంటేనే క్యాడర్ బేస్డ్‌ పార్టీ అని చెప్పుతుంటారు. ఆ పార్టీకి కార్యకర్తలే రక్షణ కవచాలు. అందుకే.. నేతలు ఎంతమంది వెళ్లిపోయినా నాలుగు దశాబ్దాలుగా పార్టీ ఇంకా జీవిస్తూనే ఉంది.

Also Read: ఏపీ విద్యార్థినులకు సీఎం జగన్ మరో బంపర్ గిఫ్ట్

ఇక తెలుగుదేశానికంటూ కొన్ని కంచుకోటలు ఉన్నాయి. అవి ఎప్పటికీ బీటలు వారవు. ఆరు నూరు అయినా కూడా తెలుగుదేశానికే ఓటేస్తుంటారు. కానీ.. అదేంటో 2019 నుంచి సీన్ అంతా రివర్స్‌ అయింది. టీడీపీ కంచుకోటలు మంచుకోటలుగా మారిపోతున్నాయి. కుప్పం, హిందూపురం సీట్లను సైకిల్ పార్టీకి అంకితం అయినట్లుగానే భావిస్తారు. ఇక్కడ ఎవరు నామినేషన్ వేసినా గెలుపు ఖాయం. మెజారిటీనే చూడమంటారు. అలాంటి ఈ రెండు చోట్ల పంచాయతీ ఎన్నికల్లో పసుపు పార్టీ దారుణంగా ఓడింది.

చంద్రబాబును ఏడు సార్లు గెలిపించిన కుప్పంలో ఈసారి పంచాయతీ ఎన్నికలు జరిగితే మొత్తం 88 సర్పంచులకు గానూ 74 మంది వైసీపీ మద్దతుదారులే గెలిచారు. అంటే ఇక్కడ చంద్రబాబుకు ప్రమాద ఘంటికలు మోగినట్లేనని భావిస్తున్నారు. ఇక హిందూపురం ఏనాడైతే ఎన్టీయార్ పోటీ చేశారో నాటి నుంచి అది నందమూరి పురం అయిపోయింది. మరి అలాంటి చోట్ల రెండు సార్లు గెలిచిన బాలయ్యకు పంచాయతీ పోరు చుక్కలు చూపించింది. ఏకంగా 52 పంచాయతీలకు ఎన్నికలు జరిగితే 47 చోట్ల వైసీపీ మద్దతుదారులు గెలవడం ద్వారా హిందూపురానికే షాక్ ఇచ్చేశారు.

Also Read: ఏడాదిగా జీతాల్లేవు.. హెచ్.ఆర్.సీని ఆశ్రయించిన ఆ పత్రిక ఉద్యోగులు

తెలుగుదేశం పార్టీకి పటిష్టమైన కార్యకర్తలు ఉన్నారు. పోలింగ్ బూత్ దాకా ఆ పార్టీకి గట్టి యంత్రాంగం ఉందని ఇంతకాలం గొప్పలు చెప్పుకున్నారు. కానీ.. పంచాయతీ ఎన్నికల్లో మాత్రం టీడీపీకి దారుణమైన ఫలితాలే వచ్చాయి. కార్యకర్తలు కూడా మార్పు కోరుకుంటున్నారా అన్నదే ఇప్పుడు పార్టీలో చర్చ నడుస్తోంది. చంద్రబాబు ఎంతసేపూ తాను మారకుండా పార్టీ నేతలను మాత్రం మారాలంటారు. అందుకే ఈసారికి వారి మైండ్ సెట్ చేంజ్ అయినట్లు ఈ ఫలితాలను చూస్తుంటే అర్థమవుతోంది. మొత్తానికి పంచాయతీ ఎన్నికల ఫలితాలు తెలుగుదేశం బలహీనతను డొల్లతనాన్ని బట్టబయలు చేశాయని నిపుణులు అంటున్నారు.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్