కరోనాకు భాషలేదంటున్న త్రిష

కరోనా(కోవిడ్-19) వైరస్ కు భాష, ప్రాంతం, పేద, ధనిక తేడా లేదని వెటరన్ బ్యూటీ త్రిష తెలిపారు. ఈ వైరస్ ఎవరైనా ఈజీగా సోకుతుందని త్రిష అన్నారు. కరోనా నివారణకు స్వీయ నియంత్రణే పాటించడమే అందరికీ మంచిదని పేర్కొన్నారు. కరోనా మహమ్మరిపై ప్రజలకు అవగాహన కల్పించేలా పలు జాగ్రత్తలతో కూడిన వీడియోను ఆమె సోషల్ మీడియాలో విడుదల చేశారు. దేశంలో ప్రస్తుతం కరోనా బాధితుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తుందన్నారు. కరోనా నివారణకు ప్రతీఒక్కరూ ఇంట్లోనే […]

Written By: Neelambaram, Updated On : March 28, 2020 4:07 pm
Follow us on

కరోనా(కోవిడ్-19) వైరస్ కు భాష, ప్రాంతం, పేద, ధనిక తేడా లేదని వెటరన్ బ్యూటీ త్రిష తెలిపారు. ఈ వైరస్ ఎవరైనా ఈజీగా సోకుతుందని త్రిష అన్నారు. కరోనా నివారణకు స్వీయ నియంత్రణే పాటించడమే అందరికీ మంచిదని పేర్కొన్నారు. కరోనా మహమ్మరిపై ప్రజలకు అవగాహన కల్పించేలా పలు జాగ్రత్తలతో కూడిన వీడియోను ఆమె సోషల్ మీడియాలో విడుదల చేశారు.

దేశంలో ప్రస్తుతం కరోనా బాధితుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తుందన్నారు. కరోనా నివారణకు ప్రతీఒక్కరూ ఇంట్లోనే ఉండాలని త్రిష కోరారు. ఇంట్లో ఉండటం కొంచెం ఇబ్బందే అయినప్పటకీ సమాజం కోసం.. మన కుటుంబాల కోసం కొన్ని రోజులు ఇంట్లో ఉండక తప్పదని ఆమె అన్నారు. కరోనా నివారణకు ప్రజలంతా ఐక్యంగా ఉంటే అరికట్టవచ్చని పేర్కొన్నారు.

త్రిషతోపాటు పలువురు సెలబ్రెటీలు కరోనా నివారణపై సోషల్ మీడియాలో అవగాహన కల్పిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు తదితరులు కూడా కరోనాపై పలు జాగ్రత్తలను వివరిస్తూ వీడియోలను విడుదల చేసిన సంగతి తెల్సిందే. త్రిష కరోనాపై జాగ్రత్తలను వివరిస్తూ వీడియో చేయడంపై ఆమె అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.