ఉత్తమ్ కుమార్ రెడ్డిని కాంగ్రెస్ ఏం చేస్తోంది..?

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డికి అధిష్టానం మరో పెద్ద బాధ్యతను కట్టబెడుతుందన్న ప్రచారం సాగుతోంది. లోక్ సభా పక్ష నేతగా ఉత్తమ్ కుమార్ రెడ్డిని నియమిస్తారా..? అని అనుకుంటున్నారు. అయితే కొన్నిపరిణామాలను బట్టి చూస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డికి అద్భుత అవకాశం ఉంది. కానీ అది సాధ్యం అవుతుందా..? అన్న చర్చ సాగుతోంది. కాంగ్రెస్ లోని నేతలకు ఒకరికి ఒకే పదవి ఇవ్వాలన్న నిబంధనను కఠినతరం చేయనుంది. ఈ […]

Written By: NARESH, Updated On : July 13, 2021 10:33 am
Follow us on

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డికి అధిష్టానం మరో పెద్ద బాధ్యతను కట్టబెడుతుందన్న ప్రచారం సాగుతోంది. లోక్ సభా పక్ష నేతగా ఉత్తమ్ కుమార్ రెడ్డిని నియమిస్తారా..? అని అనుకుంటున్నారు. అయితే కొన్నిపరిణామాలను బట్టి చూస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డికి అద్భుత అవకాశం ఉంది. కానీ అది సాధ్యం అవుతుందా..? అన్న చర్చ సాగుతోంది. కాంగ్రెస్ లోని నేతలకు ఒకరికి ఒకే పదవి ఇవ్వాలన్న నిబంధనను కఠినతరం చేయనుంది. ఈ నేపథ్యంలో రెండు పదవులున్న వారి నుంచి ఒక పదవి తీసేసే క్రమంలో ఉత్తమ్ కుమార్ రెడ్డికి లోక్ సభా పక్ష నేతగా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని కాంగ్రెస్ వర్గాలంటున్నాయి.

ప్రస్తుతం కాంగ్రెస్ లోక్ సభా పక్ష నేతగా అధిర్ రంజన్ చౌదరి ఉన్నారు. ఆయన బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు కూడా. అయితే రెండు పదవులు నిర్వహిస్తున్న వారి నుంచి ఒకదానిని రిలీవ్ చేయనున్నారు. ఇందులో భాగంగా లోక్ సభా పక్ష పదవి ఎవరికి ఇవ్వాలన్న చర్చ సాగుతోంది. ఇప్పటికే జన్ పథ్ లో ఈ విషయంపై జోరుగా చర్చలు మొదలు పెట్టారు. అయితే కాంగ్రెస్ సభాపక్ష నేతగా వ్యవహరించనని అధిర్ రంజన్ తేల్చిన నేపథ్యంలో మరో నేత కోసం అన్వేషిస్తున్నారు.

దీంతో ఉత్తమ్ కుమార్ రెడ్డికి అవకాశాలు దక్కుతాయని అంటున్నారు. కాంగ్రెస్ కు విధేయుడిగా ఉంటున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణ పీసీసీ బాధ్యతలు అప్పగించారు. అయితే ఆయన అధ్యక్షుడిగా ఉన్నాన్నాళ్లు కాంగ్రెస్ రెండో స్థానం నుంచి మూడో స్థానినికి దిగింది. దీంతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. అయితే అధిష్టానం కూడా ఆయన రాజీనామాను ఆమోదించింది. ఈ నేపథ్యంలో ఆయనకు ఉన్నత పదవిని అప్పగించాలని ఆలోచిస్తోంది.

ఈనేపథ్యంలో లోక్ సభా పక్ష నేతగా ఎంపిక చేస్తే ఎలా ఉంటుందన్న చర్చ సాగుతోంది. అయితే లోక్ సభా పక్ష నేత అంటే వాగ్ధాటి వ్యాఖ్యలతో సభలో ప్రత్యేకత సాధించాలి. ప్రస్తుతం లోక్ సభలో బీజేపీకి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి బీజేపీని ఎదుర్కోగలడా..? అన్న చర్చ సాగుతోంది. అయితే అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందోనని చర్చించుకుంటున్నారు.