China Strategy: చైనా దురాక్రమణకు కాలు దువ్వుతోంది. దాయాది దేశాలపై ఉక్కుపాదం మోపాలని చూస్తోంది. ఇందులో భాగంగానే తైవాన్ ఆక్రమణకు వ్యూహాలు పన్నుతోంది. దీనికి గాను అమెరికా, జపాన్ లను దెబ్బ తీయాలని పన్నాగాలు పన్నుతోంది. ఈ విషయం అమెరికా, జపాన్ లకు ఆగ్రహం తెప్పిస్తోంది. డ్రాగన్ ఇప్పటికే యుద్ధ విన్యాసాలకు కాలు దువ్వుతోంది. చైనాలోని షింజియాంగ్ లోని ఎడారి ప్రాంతంలో జపాన్ తరహా విమానాల నమూనా ఈ-767 తో తైవాన్ ఆక్రమణకు సన్నాహాలు చేస్తోంది.

సుదూరాల్లో ఉండే దళాల కదలికలను గుర్తించేందుకు డ్రాగన్ అధునాతన రీతిలో ఆలోచిస్తోంది. శత్రుదేశాల విమానాలు, క్షిపణుల రాకను గమనించేందుకు స్వదేశీ ఫైటర్ జెట్లను రంగంలోకి దించుతోంది. ఈ విమానాలను గగనతలంలో ఉన్నప్పుడు కూల్చడం సాధ్యం కాదు. అందుకే నేలపై ఉన్నప్పుడే దాడి చేసేందుకు వీలుంటుంది. చైనా ఇదే వ్యూహం పన్నుతూ ముందుకు వెళ్తోంది. దీంతో అమెరికా, జపాన్ డ్రాగన్ ఆశలను వమ్ము చేసే అవకాశం ఉండటంతో భవిష్యత్ ఎలా ఉంటుందో తెలియడం లేదు.
Also Read: Secret Behind Rajya Sabha Ticket: హే కృష్ణా.. రాజ్యసభ టికెట్ వెనుక అంత రహస్యం ఉందా!?
అమెరికా, జపాన్ దేశాలకు ఉన్న సాంకేతికతతో డ్రాగన్ కదలికలపై ఉపగ్రహ చిత్రాల ద్వారా విషయాలు తొందరగా పసిగట్టే అవకాశం ఉంది. తైవాన్ ను రక్షించేందుకు అమెరికా, జపాన్ రంగంలోకి దిగుతాయని తెలిసిందే. తైవాన్ ను ఆక్రమించుకోవడం అంత తేలిక కాదనే విషయం డ్రాగన్ కు కూడా అర్థమైనా తన కుట్రలను మాత్రం అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
చైనా దురాక్రమణకు ప్రయత్నిస్తే రక్షిస్తామని టోక్యోలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పేర్కొనడం గమనార్హం. దీంతో తైవాన్ ను తమ గుప్పిట్లోకి తెచ్చుకోవడం అంత సులువు కాదనే విషయం చైనాకు ఇప్పటికే తెలిసింది. తైవాన్ ను బలవంతంగా విలీనం చేసుకోవాలని చూస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు. తైవాన్ రక్షణ విషయంలో రెండు దేశాలు మద్దతుగా ఉండటంతో డ్రాగన్ కుట్రలు పని చేయవని తెలుస్తోంది.
దాయాది దేశాలపై చైనా ఎప్పుడు కూడా కుతంత్రాలతోనే వ్యవహరిస్తుంది. అందుకే భారత్ ను కూడా పలుమార్లు కష్టాలకు గురిచేసిన డ్రాగన్ తీరును ఎండగట్టేందుకు జపాన్, అమెరికా ఉండటంతో చైనా అదుపులో ఉన్నట్లు చెబుతున్నారు. లేకపోతే ఈ పాటికే తైవాన్ పై యుద్ధానికి కాలు దువ్వేదని నిపుణులు పేర్కొంటున్నారు.
Also Read: The financial crisis: కేసీఆర్, జగనే కాదు.. మోడీ కూడా అంతే!
Recommended Videos:
https://www.youtube.com/watch?v=iUtvpRtc5hE&t=11s