హీరోయిన్ ప్రణీత సుభాష్ అమ్మ అని పిలిపించుకోవడానికి ఎంతగానో తహతహలాడుతోంది. తాజాగా బేబీ బంప్ ఫొటోలు పోస్ట్ చేసి తన ఆనందాన్ని వ్యక్తపరిచింది. తన భర్తతో కలిసి దిగిన బ్యూటిఫుల్ ఫోటోలను ఆమె తన ఫాలోవర్స్ తో పంచుకుంది. ఇక ప్రణీత తన బేబీ బంప్ తో పాటు పక్కన తన భర్తతో కలిసి దిగిన ఫోటోలను చూసి ఫ్యాన్స్ లవ్ యూ అంటూ మెసేజ్ చేస్తూ ట్వీట్స్ చేస్తున్నారు.

హోమ్లీ హీరోయిన్ ప్రణీత సుభాష్ నితిన్ రాజు అనే బిజినెస్ మెన్ ను పెళ్లి చేసుకుంది. గత కొంత కాలంగా ఫ్యామిలీ లైఫ్ ను హ్యాపీగా లీడ్ చేస్తున్న ప్రణీత.. మొత్తానికి తల్లిగా ప్రమోట్ అవ్వబోతుంది. ఇక టాలీవుడ్ లోకి ప్రణీత సుభాష్ ‘ఏం పిల్లో.. ఏం పిల్లడో’ ఆమె సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. తెలుగు తెరకు గ్రాండ్ గా పరిచయం కాకపోవడం కారణంగా ఆమెకు పెద్దగా పెద్ద సినిమాలు రాలేదు.
Also Read: Sarkaru Vaari Paata 11th Days Collections: ‘సర్కారు’ 11 రోజుల కలెక్షన్స్.. ఎన్ని కోట్లు వచ్చాయంటే ?
పవన్ కళ్యాణ్ పక్కన సెకండ్ హీరోయిన్ గా నటించినా ఆ సినిమా ఆమెకు పెద్దగా ప్లస్ కాలేదు. ఆ తర్వాత కూడా ప్రణీత చాలా చిత్రాల్లో నటించింది. కానీ.. ఏ చిత్రం ప్రణీత కెరీర్ ను టర్న్ చేయలేకపోయింది. ఎలాగూ సినీ కెరీర్ బాగాలేదు కాబట్టే.. ఆమె నితిన్ రాజును పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయిపోయింది.

ప్రణీత పెళ్లి ఫోటోలు ఆ మధ్య సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. మొత్తానికి కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన ప్రణీత.. ఇటీవల సీమంతం కూడా గ్రాండ్ గా చేసుకుంది. అయితే, ప్రణీతకు అందం ఉన్నా, అణుకువ ఉన్నా, అన్నిటికీ మించి మంచితనం ఉన్నా.. ఉన్నతమైన సినిమాలు ఆమె చెంతకు చేరలేదు.
చాలా కాలంగా సెకెండ్ లెవల్ హీరోయిన్ గానే మిగిలిపోయింది ప్రణీత. గత ఏడాది పెళ్లి కూడా చేసుకున్న తర్వాత, ఈ హోమ్లీ బ్యూటీ మళ్లీ సినిమాల్లో నటించలేదు.
Also Read: Maa Reality Show: ‘ మా ’ కష్టాలు.. మనందరికీ నష్టాలు..!! రియాల్టీ షో.. ప్రేక్షకులకు తలనొప్పులు!
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
Recommended videos