https://oktelugu.com/

టీడీపీలో వృద్దులకే మాట్లాడే అవకాశమా?

టీడీపీలో విచిత్రమైన పరిస్థితి. మాట్లాడేందుకు ఉత్సాహం ఉన్నా వద్దనే వేధింపులు. దీంతో లోపల విషయం తన్నుకొస్తున్నా తటపటాయిస్తున్నారు. సంశయంలో పడిపోతున్నారు. అధినేత గీసిన గీతను దాటలేక పోతున్నారు. ఇలాగే జరిగితే భవిష్యత్తులో పార్టీ నిలవడం అనుమానమే అని తెలుస్తోంది. పార్టీలో భావ ప్రకటన స్వేచ్ఛ అందరికీ ఉంటుంది. కానీ కాని కొందరికే అవకాశం ఇస్తూ మరికొందరిని సముదాయిస్తూ పార్టీ అధినేత తప్పు చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో పార్టీపై చాలా మంది గుర్రుగానే ఉన్నారు. […]

Written By: , Updated On : May 31, 2021 / 09:54 AM IST
Follow us on

టీడీపీలో విచిత్రమైన పరిస్థితి. మాట్లాడేందుకు ఉత్సాహం ఉన్నా వద్దనే వేధింపులు. దీంతో లోపల విషయం తన్నుకొస్తున్నా తటపటాయిస్తున్నారు. సంశయంలో పడిపోతున్నారు. అధినేత గీసిన గీతను దాటలేక పోతున్నారు. ఇలాగే జరిగితే భవిష్యత్తులో పార్టీ నిలవడం అనుమానమే అని తెలుస్తోంది. పార్టీలో భావ ప్రకటన స్వేచ్ఛ అందరికీ ఉంటుంది. కానీ కాని కొందరికే అవకాశం ఇస్తూ మరికొందరిని సముదాయిస్తూ పార్టీ అధినేత తప్పు చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో పార్టీపై చాలా మంది గుర్రుగానే ఉన్నారు. తమను మాట్లాడేందుకు ఎందుకు అవకాశం ఇవ్వడం లేదో చెప్పాలని బాహాటంగానే విమర్శలు చేస్తున్నారు. మేం కాదా పార్టీ సభ్యులం? మాకు మాట్లాడే సత్తా లేదా? అని ప్రశ్నిస్తున్నారు.

కరోనాతో సతమతమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వంపై దాడి చేయాలని భావిస్తున్నా అధినేత నుంచి అందిన ఆదేశాలతో నోరు దగ్గర పెట్టుకోని ఉండాల్సి వస్తుందని నిరసన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు కొందరికే మాట్లాడే అవకాశం ఇవ్వడంపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అసలు మేం నాయకులం కామా? మాకు సత్తా లేదా? మాట్టాడలేమా అని పలు కోణాలలో ఆలోచిస్తున్నారు. రెండు దశాబ్దాలుగా పార్టీలో ఉన్నాం మాకు తెలియదా అని సంశయిస్తున్నారు.

పార్టీ ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు సైతం ఇదే తరహాలో కినుక వహిస్తున్నారు. వృద్ధ నేతలు, వచ్చే ఎన్నికల్లో పోటీ చేయని వారిని ముందుకు తీసుకువస్తున్నారు. వారితో మాట్లాడిస్తున్నారు. యువ నాయకులను పక్కన పెడుతున్నారు. దీనికి కారణమేంటని ఆరా తీస్తే ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. లోకేష్ ను వచ్చే ఎన్నికల్లో ప్రధాన నాయకుడిగా చేయాలన్నదే చంద్రబాబు తపన. దాని కోసమే ఇప్పటి నుంచి పావులు కదుపుతూ డామినేషన్ చేసే వారిని పక్కన పెడుతున్నారనే ప్రచారం సాగుతోంది.

కుమారుడు లోకేష్ ను కీలక పాత్ర పోషించేందుకు అనుకూల సమయం కోసం వేచి చూస్తున్న బాబుకు ఇదే కచ్చితమైన సమయంగా అనిపించవచ్చు. దీంతో యువత మాట వినాలంటే ఇప్పటి నుంచే వారిని అదుపులో పెట్టుకోవాలని భావించి ఈ మేరకు నిర్ణయాలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. కానీ వ్యక్తి కోసం పార్టీని బలి చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని సీనియర్ నాయకులు చెబుతున్నారు. సీనియర్లకు ప్రాతినిథ్యం కల్పించకపోతే భవిష్యత్తు అంధకారమవుతుందని హెచ్చరస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే పార్టీ ఏ తీరాలకు పోతుందో చూడాలని చెబుతున్నారు.