Indian Railways: ఇండియన్ రైల్వేకు ఏమైంది… ఈ ప్రమాదాల లెక్కేంటి?

మూడేళ్ల కిందటి వరకు రైలు ప్రమాదాలు పెద్దగా జరిగిన దాఖలాలు లేవు. ఎక్కడో ఓ చోట పట్టాలు తప్పడం, సాంకేతిక సమస్యలతో ఇబ్బందులు ఏర్పడడం కానీ.. ఇటీవల మాత్రం ఓకే ట్రాక్ లో వస్తున్న రైలు ఢీ కొట్టుకుంటున్నాయి.

Written By: Dharma, Updated On : October 30, 2023 2:27 pm
Follow us on

Indian Railways: గతంలో ఎన్నడూ లేనివిధంగా దేశంలో రైలు ప్రమాదాలు పెరుగుతున్నాయి. వాస్తవానికి మాన్యువల్ సిగ్నల్స్ వ్యవస్థ ఉన్నప్పుడు సైతం ప్రమాదాలు అంతంత మాత్రమే. కానీ అత్యాధునిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తర్వాత సైతం భారీ ప్రమాదాలు చోటు చేసుకోవడం విశేషం. దీనిపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. వందే భారత్ రైళ్లపై ఆర్భాటం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం, రైల్వే శాఖ సాధారణ రైళ్లపై దృష్టి తగ్గించినట్లు విమర్శలు వస్తున్నాయి. దీనిపై రకరకాల విశ్లేషణలు వెలువడుతున్నాయి.

గతంలో ఎక్కడైనా రైలు ప్రమాదం జరిగితే.. ఆ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ సంబంధిత మంత్రి పదవికి రాజీనామా చేసేవారు. గత రెండు దశాబ్దాలుగా పరిస్థితి మారిపోయింది. ప్రస్తుతం ఆ రాజీనామా అనే మాటే వినిపించడం లేదు. ఘోరమైన రైలు ప్రమాదాలు జరిగినా కనీస బాధ్యత అన్నమాట లేదు. ప్రమాదం జరిగిన వెంటనే సాయం చేస్తున్నట్లుగా ఫోటోషూట్లు చేసుకుంటున్నారే కానీ.. కనీస బాధ్యతగా రాజీనామా ప్రకటన మాత్రం చేయడం లేదు. గతంలో ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు విపక్షాలు సైతం రాజీనామాను కోరేవి. ఇప్పుడు విపక్షాలు సైతం పట్టించుకోవడం మానేశాయి.

మూడేళ్ల కిందటి వరకు రైలు ప్రమాదాలు పెద్దగా జరిగిన దాఖలాలు లేవు. ఎక్కడో ఓ చోట పట్టాలు తప్పడం, సాంకేతిక సమస్యలతో ఇబ్బందులు ఏర్పడడం కానీ.. ఇటీవల మాత్రం ఓకే ట్రాక్ లో వస్తున్న రైలు ఢీ కొట్టుకుంటున్నాయి. వందలాదిమంది ప్రాణాలను బలికుంటున్నాయి. విజయనగరం జిల్లాలో ప్రమాద తీరును చూస్తేసిగ్నలింగ్ వ్యవస్థ ఇంత దిగజారిందా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.మొన్నటికి మొన్న బాలాసూర్లో సైతం ఇలానే లోపం వెలుగు చూసింది. దాని నుంచి గుణపాఠాలు నేర్చుకునే స్థితిలో రైల్వే శాఖ ఉండకపోవడం ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.

భారత్ వెలిగిపోతోంది.. రైల్వే శాఖలో సంస్కరణలు తీసుకొచ్చి సమూల మార్పులు తెచ్చామని కేంద్రం ఆర్భాటంగా ప్రకటిస్తోంది. అయితే తాజా ప్రమాదాలతో కేంద్రం కొత్తగా తీస్తున్న సంస్కరణలే వీటికి కారణం అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వందే భారత్ లాంటి రైళ్లను ప్రచారాస్త్రంగా చేసుకొని.. ప్యాసింజర్, ఇతరత్రా రైల్వే వ్యవస్థల్లో మౌలిక వసతులను కల్పించడం లేదన్న విమర్శ ఉంది. జూన్లో బాలాసూర్ లో జరిగిన ఘటనలు వందలాది మంది చనిపోయారు. అది మరొక ముందే పది రోజుల క్రితం బీహార్ లోని నార్త్ ఈస్ట్ ఎక్స్ప్రెస్ ప్రమాదానికి గురైంది. పదిమందికి పైగా చనిపోయారు. ఇప్పుడు విజయనగరం జిల్లాలో ఘటనలో పదుల సంఖ్యలో మృత్యువాత పడ్డారు. ఇప్పటికైనా మేల్కొనకుంటే మాత్రం రైల్వే ప్రమాదాలు పెరుగుతూనే ఉంటాయి. వీటిని నియంత్రించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పై ఉంది.