Kotha Prabhakar Reddy : మెదక్ బీఆర్ఎస్ ఎంపీ, దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి మీద కత్తితో దాడి చేయడం కలకలం రేపింది. దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేస్తున్న కొత్త ప్రభాకర్ రెడ్డిపై సోమవారం మధ్యాహ్నం హత్యాయత్నం జరిగింది. ఎన్నిక ప్రచారంలో పాల్గొన్న ప్రభాకర్ రెడ్డిపై ఓ గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి చేసినట్లు తెలిసింది. దీంతో ప్రభాకర్ రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్ర రక్తప్రసావంతో బాధపడుతున్న ప్రభాకర్ రెడ్డిని చికిత్స నిమిత్తం గజ్వేల్ ఆస్పత్రికి తరలించారు.
సూరంపల్లిలో పాస్టర్ కుటుంబాన్ని పరామర్శించి బయటకు వస్తుండగా ఎంపీపై దాడి జరిగింది. ఆయనకు పొట్టలో గాయలయ్యాయి. కరచాలనం చేసేందుకు వచ్చిన రాజు అనే వ్యక్తి ఉన్నట్టుండి ఒక్కసారిగా కత్తితో దాడి చేశాడు.
మెరుగైన వైద్యం కోసం ప్రభాకర్ రెడ్డిని హైదరాబాద్ కు తరలించారు. నిందితుడిని స్థానికులు పట్టుకొని చితకబాదారు.
మెదక్ బీఆర్ఎస్ ఎంపీ, దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి మీద కత్తితో దాడి చేసిన వ్యక్తిని చితకబాదిన కార్యకర్తలు. pic.twitter.com/jnGjOuIhTo
— Telugu Scribe (@TeluguScribe) October 30, 2023
ఈ ఘటన దౌల్లాబాద్ మండలం సూరంపల్లిలో సోమవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియవలసి ఉంది. మంత్రి హరీష్ రావుకు విషయం తెలియగానే ఆయన గజ్వేల్ ఆస్పత్రికి చేరుకున్నారు. ఎంపీ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
మెదక్ బీఆర్ఎస్ ఎంపీ, దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి మీద కత్తితో దాడి
సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం సూరంపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పై కత్తితో దాడి చేసిన గుర్తుతెలియని వ్యక్తి . pic.twitter.com/kQNiXQKGaG
— Telugu Scribe (@TeluguScribe) October 30, 2023