Maruti Swift: కారు కొనాలనే కోరిక కల్పిస్తున్న కొత్త స్విప్ట్.. ధర, ఫీచర్స్ చూస్తే ఫ్లాట్ అవడం ఖాయం..

దీంతో మొన్నటి వరకు హ్యాచ్ బ్యాక్ కార్లను కొనుగోలు చేసిన వారు ఇప్పుడు ఎస్ యూవీలపై మనసు పెడుతున్నారు. కంపెనీలు సైతం SUVలకే ప్రిఫరెన్స్ ఇస్తున్నాయి. ఈ తరుణంలో మారుతు సుజుకీ నుంచి రిలీజ్ అయిన స్విప్ట్ కొత్త తరహాలో రూపాంతరం చెందింది.

Written By: Chai Muchhata, Updated On : October 30, 2023 2:22 pm
Follow us on

Maruti Swift: మారుతి సుజుకీ నుంచి రిలీజ్ అయిన ఎన్నో కార్లు వినియోగదారులను ఆకట్టకున్నాయి. వీటిలో స్విప్ట్ బెస్ట్ మోడల్ గా నిలిచింది. అన్ని వర్గాల వారికి ఆకట్టుకున్న స్విప్ట్ ఇప్టటకీ విక్రయాలు జరుపుకోవడం విశేషం. అయితే కాలం మారుతున్నకొద్దీ వినియోగదారుల అభిరుచుల్లో మార్పులు వస్తున్నాయి.

దీంతో మొన్నటి వరకు హ్యాచ్ బ్యాక్ కార్లను కొనుగోలు చేసిన వారు ఇప్పుడు ఎస్ యూవీలపై మనసు పెడుతున్నారు. కంపెనీలు సైతం SUVలకే ప్రిఫరెన్స్ ఇస్తున్నాయి. ఈ తరుణంలో మారుతు సుజుకీ నుంచి రిలీజ్ అయిన స్విప్ట్ కొత్త తరహాలో రూపాంతరం చెందింది. దీని ధర, ఫీచర్స్ గురించి తెలిస్తే కారు కొనకుండా ఉండలేరని అంటున్నారు.

కొత్త స్విప్ట్ లో 9 అంగుళాల టచ్ స్క్రీన్ ఉంది. ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, స్టీరింగ్ వీల్ తో పాటు టోగుల్ స్విచ్ లు కలిగి ఉన్నాయి. ఏసీ వెంట్స్, వైర్ లెస్ ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, కనెక్ట్ టెక్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటిని ఆకట్టుకుంటున్నాయి. ఫ్రంట్ బంపర్, కొత్త బ్లాక్ గిల్, అప్ డేటేడ్ డీఆర్ ఎల్, ఎల్ ఈడీ హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. భద్రతా విషయంలోనూ కొత్త స్విప్ట్ విషయంలో కేర్ తీసుకున్నారు. ఇందులో డ్యూయెల్ సెన్సార్ బ్రేక్ సపోర్టు, ఆడాప్టిన్ హై బీమ్ ఆసిస్ట్, డ్రైవర్ మానిటరింగ్ సిస్టమ్ కలిగి ఉన్నాయి.

పాత స్విప్ట్ ఫీచర్స్ విషయానికొస్తే 1.2 లీటర్, 4 సిలిండర్ ఇంజిన్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ ఇంజిన్ ను కొత్త స్విప్ట్ లో 1.2 లీట్ జెడ్ సిరీస్ తో అప్డేట్ చేస్తూ సీఎన్ జీ ని కూడా అందించనున్నారు. ఇక స్విప్ట్ 5 స్పీడ్ ఏఎంటీ ని కలిగి ఉంది. పాత స్విప్ట్ లో పాటు 90 బీహెచ్ పీ పవర్ 113 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. కొత్త స్విప్ట్ లో హార్స్ పవర్ పెరిగే అవకాశాలు ఉన్నాయి.

స్విప్ట్ నెక్ట్స్ జనరేషన్ ను టోక్యోలో ప్రదర్శించారు. ఈ మోడల్ లీటర్ కు 40 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 2024లో భారత్ లో ఆవిష్కిరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీనిని రూ.6.50 లక్షల ప్రారంభంతో విక్రయించే ఛాన్స్ ఉంది. ఆన్ రోడ్ కు రూ.10 లక్షలు అవుతుంది. మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీతో వస్తున్న ఈ కారు పై భవిష్యత్ లో ఆఫర్లు కూడా ప్రకటిస్తారని అంటున్నారు.