Rythu Bandhu: రైతు బంధు రూ.7,700 కోట్లు ఏమయ్యాయి?

ప్రభుత్వం మారిపోయింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పథకానికి మార్గదర్శకాలు రూపొందించడానికి కసరత్తు చేస్తోంది. ఇంతలో ట్రెజరీలో కెసిఆర్ సర్కార్ జమ చేసిన రూ. 7700 కోట్లను విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.

Written By: Dharma, Updated On : December 20, 2023 12:42 pm

Rythu Bandhu

Follow us on

Rythu Bandhu: తెలంగాణలో రైతుబంధు పథకం నిధులు సక్రమంగా రైతుల ఖాతాలో జమ కావడం లేదు. కెసిఆర్ ప్రభుత్వం ఏటా రైతులకు పెట్టుబడి సాయం కింద రూ.10 వేలు అందించిన సంగతి తెలిసిందే. రెండు విడతల్లో ఆర్థిక సాయం అందిస్తుండగా.. సరిగ్గా అసెంబ్లీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో రబీ సీజన్ కు సంబంధించి సాయం ఇంతవరకు అందలేదు.ఎన్నికల సమయంలో రైతు బంధు పథకాన్ని కాంగ్రెస్ నేతలు అడ్డుకున్నారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమేనని ఈసీకి ఫిర్యాదు చేశారు. అటు తర్వాత బీర్ఎస్ ప్రత్యేక విజ్ఞప్తితో ఎలక్షన్ కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

కానీ ప్రభుత్వం మారిపోయింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పథకానికి మార్గదర్శకాలు రూపొందించడానికి కసరత్తు చేస్తోంది. ఇంతలో ట్రెజరీలో కెసిఆర్ సర్కార్ జమ చేసిన రూ. 7700 కోట్లను విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇది జరిగి రోజులు గడుస్తున్నా రైతులు ఖాతాల్లో మాత్రం ఇంతవరకు రైతుబంధు నిధులు జమ కావడం లేదు. దీంతో రైతుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వ చర్యలపై అప్పుడే అనుమానాలు కూడా ప్రారంభమయ్యాయి. వేలకోట్ల రూపాయలు ఎటు వెళ్లిపోయాయి అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

బిఆర్ఎస్ ప్రభుత్వం 2018 నుంచి రైతుబంధు అమలు చేస్తోంది. ప్రతి ఎకరాకు రూ.5 వేల చొప్పున జమ చేస్తున్నారు. గత ఖరీఫ్ వరకు ఈ ప్రక్రియ సక్రమంగా కొనసాగింది. కానీ ఈ ఏడాది రబీకి సంబంధించి నవంబర్ 26న రైతుబంధు జమ చేయాల్సి ఉంది. కానీ ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారింది. అయితే అది నిరంతర ప్రక్రియ అని టిఆర్ఎస్ ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ కు విజ్ఞప్తి చేయడంతో మినహాయింపు ఇచ్చింది. అయితే నెల రోజులు గడుస్తున్నా ఎంతవరకు రైతుల ఖాతాల్లో నగదు జమ కాకపోవడం అనుమానాలకు తావిస్తోంది. రూ.7,700 కోట్లు ఎటు వెళ్లిపోయాయి అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. సోషల్ మీడియాలో ఇదే రచ్చ జరుగుతోంది. ఢిల్లీ టూర్లతో గడుపుతున్న రేవంత్ రెడ్డికి రైతుల ఆర్తనాదాలు వినిపించవా అన్న ప్రశ్న ఎదురవుతోంది.