Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ తెలియని బుల్లితెర ప్రేక్షకుడు ఉండడు. జబర్దస్త్ వేదికగా సుధీర్ తన టీమ్ తో సంచలనాలు చేశాడు. సుడిగాలి సుధీర్ టీమ్ అంటే నాన్ స్టాప్ నవ్వులు గ్యారంటీ. గెటప్ శ్రీను, రామ్ ప్రసాద్, సుధీర్ కాంబినేషన్ సూపర్ హిట్. వీరి స్కిట్స్ లో జబర్దస్త్ లో భారీ డిమాండ్ ఉండేది. సుధీర్ అనంతరం ఢీ రియాలిటీ షోలోకి ఎంట్రీ ఇచ్చాడు. అక్కడ యాంకర్ రష్మీ గౌతమ్ తో రొమాన్స్ చేశాడు. వీరిద్దరి కెమిస్ట్రీ అద్భుతంగా పండింది. రష్మీ-సుధీర్ అంటే బుల్లితెర ప్రేమికులు అని జనాలు ఫిక్స్ అయ్యారు.
సుధీర్ రాకతో ఢీ షోకి కూడా ఆదరణ పెరిగింది. మనోడు మల్టీ టాలెంటెడ్. మ్యాజిక్ చేసేవాడు. సింగింగ్, డాన్సింగ్ లో కూడా ప్రావీణ్యం ఉంది. తన ఒక్కో టాలెంట్ బయటకు తీస్తూ బుల్లితెర స్టార్ అయ్యాడు. ఈ క్రమంలో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. హీరోగా నటిస్తూ కూడా జబర్దస్త్ చేశాడు. ఏమైందో తెలియదు కానీ… సడన్ గా బుల్లితెర దూరమయ్యాడు. ఢీ, జబర్దస్త్ షోలకు గుడ్ బై చెప్పాడు.
మల్లెమాలతో విభేదాలనే ప్రచారం జరిగింది. అదేం లేదు, నేను అనుమతితో కొన్నాళ్ళు గ్యాప్ తీసుకున్నాను. తిరిగి జబర్దస్త్ కి వెళతానని చెప్పాడు. కానీ అది జరగలేదు. హీరోగా వరుస చిత్రాలు చేస్తున్న సుధీర్ కామెడీ స్టాక్ ఎక్స్ ఛేంజ్ షోలో సందడి చేశాడు. తెలుగు ఎంటర్టైన్మెంట్ యాప్ ఆహాలో కామెడీ ఎక్స్ ఛేంజ్ పేరుతో ఒక కామెడీ షో స్టార్ట్ చేశారు. ఫస్ట్ సీజన్ కి సుడిగాలి సుధీర్, దీపికా పిల్లి యాంకర్స్ గా ఉన్నారు. దర్శకుడు అనిల్ రావిపూడి జడ్జిగా వ్యవహరించారు.
ఇటీవల సీజన్ 2 స్టార్ట్ అయ్యింది. అనిల్ రావిపూడి మరోసారి జడ్జిగా చేస్తున్నారు. శ్రీముఖి యాంకర్ గా వ్యవహరిస్తోంది. ముక్కు అవినాష్, సద్దాం, రోహిణి, యాదమ్మ రాజుతో పాటు పలువురు బుల్లితెర కమెడియన్స్ నవ్వులు పూయిస్తున్నారు. హీరోగా బిజీగా ఉన్న సుడిగాలి సుధీర్ కామెడీ స్టాక్ ఎక్స్ ఛేంజ్ లో ప్రత్యక్షం అయ్యాడు. సుధీర్ కి గ్రాండ్ వెల్కమ్ దక్కింది. రావడంతోనే అనిల్ రావిపూడి సుధీర్ పై పంచ్ వేశాడు. జస్ట్ గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చాడా? లేక షోలో కొనసాగుతాడా? అనేది తెలియదు..
