https://oktelugu.com/

Chandrababu: చంద్రబాబు ‘ఓటుకు నోటు’ కేసు ఏమైంది? ఎలా ఉంది?

2015లో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్టీఫెన్సన్ అనే నామినేటెడ్ ఎమ్మెల్సీకి 50 లక్షల రూపాయల నగదును అప్పటి టిడిపి నాయకుడు, ఇప్పటి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అందిస్తూ రెడ్ హ్యాండెడ్గా పట్టుపడ్డారు.

Written By:
  • Dharma
  • , Updated On : October 7, 2023 / 12:33 PM IST

    Chandrababu

    Follow us on

    Chandrababu: తెలుగు రాష్ట్రాల్లో ఓటుకు నోటు కేసు సంచలనం సృష్టించింది.ఇదో హై ప్రొఫైల్ కేసుగా నిలిచింది.ఎన్నో రకాల సంచలనాలకు వేదికగా మారుతుందని అందరూ అనుకున్నారు.కానీ అనూహ్యంగా ఈ కేసు మరుగున పడిపోయింది. ఈ కేసులో చంద్రబాబు పాత్ర పై విచారణ జరగాలని సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ ఈనెల 4 న విచారణకు రానుందని ప్రచారం జరిగింది. 2017లో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసిన పిటిషన్ ఎట్టకేలకు సుప్రీంకోర్టులో రిజిస్టర్ అయ్యింది. ఇప్పటికే వివిధ కేసుల్లో రిమాండ్ ఖైదీగా చంద్రబాబు ఉన్నారు. ఇప్పుడు ఓటుకు నోటు కేసులో సైతం చంద్రబాబు పాత్ర పై అత్యున్నత న్యాయస్థానం విచారణ చేయనుందని తెలియడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కానీ తాజాగా స్కిల్ స్కాంలో చంద్రబాబు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ తో ఓటుకు నోటు కేసు పక్కకు వెళ్లిపోయింది.

    2015లో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్టీఫెన్సన్ అనే నామినేటెడ్ ఎమ్మెల్సీకి 50 లక్షల రూపాయల నగదును అప్పటి టిడిపి నాయకుడు, ఇప్పటి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అందిస్తూ రెడ్ హ్యాండెడ్గా పట్టుపడ్డారు.ఈ కేసులో రేవంత్ అరెస్టు కావడం.. బెయిల్ పై బయటకు విడుదల కావడం జరిగిపోయింది. అప్పట్లోనే చంద్రబాబుపాత్ర పై విచారణ జరపాలని ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు అయింది.విచారణకు ఏసీబీ కోర్టు ఆదేశించింది. కానీ హైకోర్టు స్టే విధించింది. దానిని సవాల్ చేస్తూ 2017లో ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే కింది కోర్టులో విచారణలో ఉండడంతో తాము కలుగజేసుకోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

    అయితే తాజాగా స్కిల్స్ స్కామ్ లో చంద్రబాబు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. అవినీతి కేసుల్లో ప్రజాప్రతినిధుల అరెస్టు సమయంలో సెక్షన్ 17 ఏ నిబంధనలను కచ్చితంగా పాటించాలని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఈ తరుణంలో ఏపీ సర్కార్ రాజకీయ కక్షతో చంద్రబాబును అరెస్టు చేయడంలో ఎటువంటి నిబంధనలు పాటించలేదని ఆయన తరుపు న్యాయవాదులు అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్లు దాఖలు చేశారు. అటు ఓటుకు నోటు కేసు సైతం అవినీతి నిరోధక పరిధిలోకి రావడంతో.. అదే సమయంలో స్కిల్ స్కాం కేసు కూడా విచారణకు రావడంతో.. ఓటుకు నోటు పిటిషన్ విచారణ పక్కకు వెళ్ళిపోయింది.ఇప్పట్లో విచారణకు వచ్చే అవకాశం లేదని సుప్రీంకోర్టు వర్గాలు చెబుతున్నాయి.మరి ఏం జరుగుతుందో చూడాలి.

    వరుస కేసులతో చంద్రబాబు పై పట్టు బిగించాలన్నది వైసిపి ప్రయత్నం. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ తో పాటు అమరావతి ఇన్నర్ రింగ్రోడ్ అలైన్మెంట్ కేసు, చిత్తూరు జిల్లా అంగళ్ళ అల్లర్ల కేసు, ఓటుకు నోటు కేసుతో చంద్రబాబు రిమాండ్ ను పొడిగించాలన్నది వైసిపి ప్లాన్. అయితే ఓటుకు నోటు కేసులో ఇప్పటికే హైకోర్టు స్టే విధించింది. ఆ స్టే కొనసాగుతోంది. దీనిపై అత్యున్నత న్యాయస్థానంవిచారణ కొనసాగించే అవకాశం లేదు. మరోవైపు 17a సెక్షన్ అనుసరించి రాజకీయ ప్రత్యర్థులపైకేసుల ప్రయోగానికి సంబంధించి.. ఈ సెక్షన్ అమలు చేశారు. చంద్రబాబు కేసులతో ఈ సెక్షన్ పై ప్రత్యేకంగా సుప్రీంకోర్టు విచారణ చేపడుతోంది. అయితే చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ పై విచారణ, తుది తీర్పు తర్వాత.. ఆ తీర్పును అనుసరించి ఓటుకు నోటు కేసు సైతం ముందుకు కదిలే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.