Gold Price : బంగారం అంటే మగువలకు ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బంగారానికి మహిళలక ఏదో అవినాభావ సంబంధం ఉంది. బంగారం అంటే వాళ్లకు చాలా ఇష్టం. ఇంట్లో ఎంత బంగారం ఉన్నప్పటికీ ఇంకా ఇంకా కొంటూనే ఉంటారు. మహిళలకే కాదు పురుషులకు కూడా బంగారం అంతే రాను రాను ఇష్టం పెరుగుతూనే ఉంది. ఇప్పటికే గోల్డ్ ను కిలోల కొద్ది ఒంటి మీద వేసుకుని తీరుగుతున్న వాళ్లను చూస్తూనే ఉన్నాము. వీలున్నప్పుడల్లా బంగారు నగలను కొని ఇంట్లో పెట్టుకోవడం చాలా మందికి అలవాటు. శుభకార్యాల్లో ధరించేందుకు.. అవసరం ఉన్నప్పుడు ఇట్టే నగదుగా మార్చుకునేందుకూ అనువుగా ఉండటం బంగారానికి సౌకర్యం. అయితే చేతిలో పైసలున్నప్పుడల్లా ఎంతంటే అంత కొని గోల్డ్‌ను ఇంట్లో పెట్టుకుంటున్నారు.
కానీ ఇక మీదట అలా జరుగకపోవచ్చు. కారణం బంగారం, వెండి ధరలు రోజురోజుకూ ఆకాశాన్ని అంటుతున్నాయి. తగ్గేదేలే అంటూ లక్షకు చేరువ అవుతున్నాయి. సామాన్యుడే కాదు మద్య తరగతి ప్రజలైనా బంగారం కొనగలరా అనేది ప్రశ్నగా మారిపోయింది. బంగారం, వెండి ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 76 వేలు పలుకుతుంటే 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 87 వేలు దాటేసింది. ఈ పరిస్థితుల్లో బంగారం అసలు కొనగలరా అనేది ప్రశ్నార్థకంగా మారిపోయింది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.350 పెరిగి రూ.79,800లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.390 పెరగడంతో తొలిసారి రూ.87,060లకు చేరింది. అటు వెండి ధర స్థిరంగా కొనసాగుతోంది. జీ సిల్వర్ రేటు రూ.1,07,000గా ఉంది.
ఈ క్రమంలోనే కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రెండు భారీ ఉపశమనం కలిగించారు. అందులో ఒకటి 12 లక్షల వరకు ఆదాయంపై ట్యాక్స్ లేకపోవడం, రెండవది బంగారం, వెండిపై కస్టమ డ్యూటీ గణనీయంగా తగ్గించడం. ఈ ప్రకటనతో పసిడి ప్రియులకు గ్రేట్ రిలీఫ్ కలిగింది. బంగారం, వెండిపై కస్టమ్స్ డ్యూటీని ఏకంగా 15 శాతం నుంచి 6 శాతానికి తగ్గించింది. అంటే ఏకంగా 9 శాతం తగ్గింది. ఫలితంగా ఏప్రిల్ తరువాత బంగారం, వెండి ధరలు గణనీయంగా తగ్గనున్నాయి. మార్కెట్ నిపుణులు అంచనాల ప్రకారం ఏప్రిల్ తరువాత బంగారం ధర 10 గ్రాములు 50 వేలకు పడిపోవచ్చని సమాచారం. చాలామంది ఏప్రిల్ వరకూ ఎందుకు అని ఆలోచిస్తున్నారు. ఎందుకంటే కొత్త బడ్జెట్ విధి విధానాలు, నిర్ణయాలు అమల్లో వచ్చేది వచ్చే ఆర్ధిక సంవత్సరం 2025-26 నుంచి. అంటే ఏప్రిల్ 1 నుంచి. అందుకే ఎవరైనా బంగారం కొనే ఆలోచన ఉంటే ఏప్రిల్ తరువాత కొనుగోలు చేయడం మంచిది.