https://oktelugu.com/

సుశాంత్ మృతిపై ఢిల్లీ ఎయిమ్స్ వైద్యుల బృందం తేల్చిందేంటీ?

యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ ఫుత్ ఆత్మహత్య కేసు మిస్టరీగా మారిన సంగతి తెల్సిందే. సుశాంత్ మృతితో బాలీవుడ్లో విషాదచాయలు నెలకొన్నాయి. సినిమాలతో బీజీగా ఉన్న సుశాంత్ సింగ్ సడెన్ గా ఆత్మహత్య చేసుకోవడంపై పలు అనుమానాలు రేకెత్తాయి. నెపోటిజం కారణంగా సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నారని కొందరు అంటుండగా.. మరికొందరు మాత్రం సుశాంత్ ను ఎవరో హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని ఆరోపణలు గుప్పించారు. సుశాంత్ ఆత్మహత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో ముంబై పోలీసులు […]

Written By:
  • NARESH
  • , Updated On : October 3, 2020 / 04:46 PM IST
    Follow us on


    యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ ఫుత్ ఆత్మహత్య కేసు మిస్టరీగా మారిన సంగతి తెల్సిందే. సుశాంత్ మృతితో బాలీవుడ్లో విషాదచాయలు నెలకొన్నాయి. సినిమాలతో బీజీగా ఉన్న సుశాంత్ సింగ్ సడెన్ గా ఆత్మహత్య చేసుకోవడంపై పలు అనుమానాలు రేకెత్తాయి. నెపోటిజం కారణంగా సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నారని కొందరు అంటుండగా.. మరికొందరు మాత్రం సుశాంత్ ను ఎవరో హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని ఆరోపణలు గుప్పించారు.

    సుశాంత్ ఆత్మహత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో ముంబై పోలీసులు రంగంలోకి దిగి మిస్టరీని చేధించేందుకు యత్నించారు. అయితే ఈ కేసులో డ్రగ్స్ లింకులు బయటపడటంతో ఈ కేసును సీఐబీ, ఎన్సీబీ అధికారులు విచారిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసుతో సంబంధం ఉన్న పలువురు సెలబ్రెటీలను అధికారులు అదుపులోకి తీసుకొని విచారించారు. వీరి విచారణలో పలు సంచలన విషయాలు వెలుగుచూశాయి.

    Also Read: కేసు పెట్టాల్సిన పోలీసులే కాట్నం పేర్చి కాల్చారు

    సుశాంత్ ది ఆత్మహత్యనా.. లేదా హత్య అని తేల్చాల్సిన అధికారులు కేసును డ్రగ్స్ కోణానికే పరిమితం చేస్తున్నారు. దీంతో ఈ కేసు పక్కదారి పడుతుందనే ఆరోపణలు వెల్లువెత్తుతోన్నాయి. అయితే తాజాగా ఢిల్లీ ఎయిమ్స్ వైద్యుల బృందం సుశాంత్ మృతిపై కీలక ప్రకటన చేసింది. సుశాంత్ ను గొంతు నులిపి చంపారనో.. విషయం చంపారనో ఆరోపణలను ఢిల్లీ ఎయిమ్స్ ఖండిచింది. సుశాంత్ ఉరి వేసుకోవడం వల్లే చనిపోయాడని ముంబై కూపర్ ఆస్పత్రి ఇచ్చిన నివేదికతో ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు ఏకీభవించారు.

    45రోజులపాటు ఢిల్లీ ఎయిమ్స్ సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ కు చెందిన నలుగురు డాక్టర్ల బృందం ఈ కేసును తమ కోణంలో విచారించింది. సుశాంత్ పోస్టుమార్టం రిపోర్టు.. సంఘటనా స్థలంలో లభించిన ఆధారంగా ఇది సుసైడేననే నిర్ధారణకు వచ్చారు. ఈ మేరకు సీబీఐకి ఢిల్లీ ఎయిమ్స్ వైద్యుల బృందం నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది.

    Also Read: మారిటోరియంలో వడ్డీపై వడ్డీ మినహాయింపు.. రుణగ్రహీతలకు ఊరట..!

    దీంతో పోలీసులు సుశాంత్ ఆత్మహత్యకు ఎవరైనా ప్రేరేపించరా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అయితే సుశాంత్ ది హత్య అనడానికి ప్రాథమిక సాక్ష్యాధికారాలు లభ్యమైతే మాత్రం ఆ దిశగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని సీబీఐ ప్రకటించడం గమనార్హం.