
ఉత్తరప్రదేశ్ రాస్తాం హత్రాస్ లో జరిగిన దారుణమైన ఘటన మరువకముందే బీహార్ లో అదే తరహా ఘటన చోటు చేసుకోవడం కలకలం రేపుతోంది. బీహార్ రాష్టంలోని గయా జిల్లాలో ఓ యువతీపై నలుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అవమానం భరించలేక ఆ యువతీ ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు ఇచ్చిన సమాచారం ప్రకారం యువతిపై రాహుల్‌కుమార్, చింటుకుమార్, చందన్‌కుమార్ సహా మరో గుర్తుతెలియని యువకుడు లైంగిక దాడికి పాల్పడినట్లు యువతి తల్లిదండ్రులు పిర్యాదు చేసినట్లు తెలిపారు.