Pawan Kalyan Meets Modi- YCP: నరేంద్ర మోడీ ఎవరు? దేశ ప్రధానమంత్రి. వచ్చింది ఎక్కడికి? ఆంధ్రప్రదేశ్ కు? మాట్లాడాల్సింది ఎవరితో? ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి తో.. కానీ సుదీర్ఘ భేటీ జరిగింది ఎవరితో? పవన్ కళ్యాణ్ తో.. అంటే ఇప్పటికే వైసిపి నాయకులకు ఒక క్లారిటీ వచ్చినట్టే కదా! కాదు కూడదు అంటే చేసేది ఏముంటుంది? ఆయనప్పటికీ
ఏదో జరిగింది.. లోపల సమ్ థింగ్ రాంగ్.. మాకు తెలియాలి.. తెలిసి తీరాలి.. మోడీ-పవన్ ముఖాముళి.. ఆ 40 నిమిషాలు ఏం జరిగిందబ్బా.. జర లీకులు ఇయ్యరాదే.. మా కొంపకు ఎసరు వస్తదా ఏంటి?..’ ఇప్పుడు ఇవే అనుమానాలు వైసీపీ బ్యాచ్ ను కలవరపెడుతున్నాయి. నిద్రలోనూ కలవరింతలకు కారణం అవుతున్నాయి.. మోడీ-పవన్ భేటిలో ఏం జరిగిందని తెలుసుకోవడానికి వైసీపీ బ్యాచ్ ఆపసోపాలు పడుతోంది.. తెగ గింజుకుంటోంది.

ఇంతకీ ఏం మాట్లాడారు? దేని గురించి మాట్లాడారు? మూడు రాజధాని గురించి పవన్ చెప్పారా? విశాఖను గిల్లుతున్న తీరు వివరించారా? బాబాయ్ హత్యను కళ్ళకు కట్టారా? ఏం మాట్లాడారు? ఎలా మాట్లాడారు? మైక్ ముందుకొచ్చి గయ గయ అరిచే అంబటి రాంబాబు సైలెంట్ అయ్యాడు. తాడేపల్లి ప్యాలస్ పై విశ్వాసం చూపించే మంత్రి నిశ్శబ్దాన్ని ఆశ్రయించాడు. ఒక ప్రధానమంత్రి.. అది కూడా క్షణం తీరికలేని సమయాన 40 నిమిషాలు మాట్లాడటం అంటే మామూలు విషయమా? జగన్ ఆపసోపాలు పడుతున్న వేళ, చంద్రబాబు కాళ్ళు అరిగేలా తిరుగుతున్న వేళ.. కాళ్లు కదపకుండా తన చెంతకే ప్రధానమంత్రి వస్తే అంతకుమించిన గొప్పతనం ఏముంటుంది? ఇప్పుడు ఇదే వైసీపీ బ్యాచ్ కు నిద్రలేని రాత్రులు పరిచయం చేస్తోంది.
ఈ ఎపిసోడ్ తర్వాత తాడేపల్లి ప్యాలస్ లో రాత్రి మొత్తం దీపాలు వెలిగాయి కావచ్చు. వీసారెడ్డి క్షణం తీరిక లేకుండా ఆలోచించాడు కావచ్చు. గుట్కా కింగ్ థింకింగ్ దెబ్బకు మారిపోయింది కావచ్చు. రోజా, రజనికి చుక్కలు కనిపించాయి కావచ్చు.
ఇక మంది మాగాదులకు 70 ఎం ఎం సినిమా కనిపించింది కావచ్చు. ఆ 40 నిమిషాలు అతడు ఏం చెప్పినా ఏపీ గురించే ఉంటుంది. అతడు ఏం మాట్లాడినా నవ్యాంధ్ర అభివృద్ధి గురించి ఉంటుంది. దేని గురించి వివరించినా రిమోట్ కంట్రోల్ పాలన గురించి ఉంటుంది. చేస్తాడా? చేయకుండా ఉంటాడా? అనేది పక్కన పెడితే తాను వస్తే ఏం చేస్తానో ఓ క్లారిటీ మోడీకి వచ్చినట్టే ఉంది. అందుకే నిమిషం కూడా తీరికలేని నాయకుడు.. 40 నిమిషాల పాటు చెప్పింది మొత్తం విన్నాడు. అక్కడ చెప్పింది పవన్.. విన్నది మోదీ.. 2014లోనూ పవన్ ఇదే చెప్పాడు. నరేంద్ర మోడీ విన్నాడు. వేదిక పైకి పిలిపించుకున్నాడు. పక్క సీట్లో కూర్చోబెట్టుకున్నాడు. ఢిల్లీకి పిలిపించుకొని మాట్లాడాడు. ఇప్పుడు ఏకంగా పవన్ వద్దకే వచ్చాడు. పవన్ అప్పుడు ఇప్పుడు ఒకే లాగా ఉన్నాడు. జనంలోనే ఉన్నాడు. జనంతోనే ఉన్నాడు.. అప్పుడు మామూలు నాయకుడిగా వచ్చిన నరేంద్ర మోడీ ఇప్పుడు ప్రధానమంత్రి అయ్యాడు. ఇప్పుడు కూడా పవన్ చెబుతున్నాడు. నరేంద్ర మోడీ వింటున్నాడు. 2014 లో వచ్చిన క్లారిటీ 2024 లో కూడా వస్తుంది. పాపం దీని గురించే వైసీపీ బ్యాచ్ గిలగిలా కొట్టుకుంటుంది.

కానీ ఆ 40 నిమిషాల భేటీ గురించి పవన్ ఒక మాట కూడా బయట చెప్పకపోవచ్చు. కానీ అతని మాటల వెనుక మార్మికత ఈ భేటీ చెప్పింది. ఇకముందు చెబుతూనే ఉంటుంది. ముందే అన్నట్టు అతనికో క్లారిటీ ఉంది. 40 ఏళ్ల విజన్ అని డబ్బాలు కొట్టుకునే వాళ్లకు మించి వివేచన ఉంది. ఆ వివేచనే 2024లో గెలిపిస్తుంది. ఆ గెలుపు ధైర్యం అలా ఉంది కాబట్టే ప్రధానమంత్రి 45 నిమిషాలు విన్నాడు. ఇక ముందు వింటాడు. వినాలి కూడా. ఆఫ్ కోర్స్ తాడేపల్లి ప్యాలెస్ కూడా వినాలి. అప్పుడెప్పుడో హనుమాన్ జంక్షన్ సినిమాలో పరుచూరి బ్రదర్స్ డైలాగ్ ఒకటి ఉంటుంది. ఓడిన వాడు వినాలి. గెలిచిన వాడు చెప్పాలి. కానీ ఓడి గెలిచిన వాడు చెబితే ఎవడైనా వినాలి. మోడీ కావచ్చు. ఎవరైనా కావచ్చు. సముద్రాన్ని నిలువరించలేము. శిఖరం తలదించలేము. సింహాన్ని ఒక గాటాన కట్టేయలేము. బహుశా పవన్ విషయంలో మోడీకి మరోసారి ఒక క్లారిటీ వచ్చింది. వైసీపీ బ్యాచ్ కు ఇది అర్థమైంది. అర్థం కానట్టు నటిస్తోంది. ఈ భేటీ తర్వాత జగన్ గాయిగాయి అవుతున్నాడు. ఏం జరుగుతుందోనని భయపడుతున్నాడు. అప్పుడెప్పుడో జల్సా సినిమాలో ముఖేష్ ఋషికి పవన్ టన్నుల్లో భయం ఇచ్చాడు. ఇప్పుడు కూడా ఇస్తున్నాడు. కాకపోతే అది సినిమా. ఇది నిజ జీవితం. రెంటికి ఒకటే తేడా సినిమాలో సంజయ్ సాహు. రియల్ లైఫ్ లో పవన్ కళ్యాణ్ అలియాస్ జనసేనాని. సాంబ ఇకనుంచి రాసుకోరా!