ఆజాద్ ఏ నిర్ణయం తీసుకుంటారు?

కాంగ్రెస్ లో సీనియర్ నాయకులు అందరు వెళ్లిపోతున్నారు. ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. పార్టీ భవితవ్యం అగమ్యగోచరంగా ఏర్పడిన నేపథ్యంలో తమ బతుకుదెరువు కోసం ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. పార్టీలో సీనియర్ నాయకుడిగా ఉన్న గులాంనబీ ఆజాద్ సైతం అదే దారిలో వెళుతున్నారు. ఆయన రాజ్యసభ పదవీ కాలం పూర్తి కావడంతో ఆయన వేరే దారి చూసుకుంటున్నారని ప్రచారం సాగుతోంది. దీనిపై త్వరలో నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. గులాం నబీ ఆజాద్ కు కాంగ్రెస్ తో […]

Written By: Srinivas, Updated On : June 2, 2021 10:45 am
Follow us on

కాంగ్రెస్ లో సీనియర్ నాయకులు అందరు వెళ్లిపోతున్నారు. ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. పార్టీ భవితవ్యం అగమ్యగోచరంగా ఏర్పడిన నేపథ్యంలో తమ బతుకుదెరువు కోసం ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. పార్టీలో సీనియర్ నాయకుడిగా ఉన్న గులాంనబీ ఆజాద్ సైతం అదే దారిలో వెళుతున్నారు. ఆయన రాజ్యసభ పదవీ కాలం పూర్తి కావడంతో ఆయన వేరే దారి చూసుకుంటున్నారని ప్రచారం సాగుతోంది. దీనిపై త్వరలో నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.

గులాం నబీ ఆజాద్ కు కాంగ్రెస్ తో నలభై ఏళ్ల అనుబంధం ఉంది. పార్టీలో చురుకైన నాయకుడిగా తన సేవలు అందించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో ఉన్నత పదవులు పొందారు. ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్ కు గులాం నబీ ఆజాద్ ఎంతో విశ్వాసపాత్రుడిగా ఉన్నారు.పార్టీ కూడా అదే స్థాయిలో ఆయనకు గౌరవం ఇచ్చింది. దీంతో 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి పాలయిన తరువాత గులాంనబీ ఆజాద్ అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం.

గులాంనబీ ఆజాద్ కు సోనియాగాంధీకి వీరవిధేయుడిగా పేరుంది. కానీ రాహుల్ గాంధీ తోనే సమస్యలున్నాయి. సీనియర్ల సలహాలు తీసుకోరని కినుక వహిస్తున్నారు. పార్టీని ముందుకు తీసుకె ళ్లడంలో విఫలమయ్యారని నిరసన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ ఓటమి చెందినంత మాత్రాన అధ్యక్ష పదవికి రాజీనామా చేయడంతో ఆయన మనసు నొచ్చుకున్నారు. దీంతో గులాంనబీ ఆజాద్ ను పార్టీ దూరం చేసింది. పార్టీకి వ్యతిరేకంగా ఆజాద్ స్వరం పెంచారు.

కాంగ్రెస్ పార్టీ విధానాలు నచ్చక 22 మంది నేతలతో పార్టీ అధినేతకు లేఖ రాయడం వివాదాస్పదమైంది. దీంతో గులాంనబీ ఆజాద్ రాజ్యసభ పదవికి మళ్లీ కాంగ్రెస్ ఎంపిక చేస్తుందా? లేదా? అన్నది పార్టీలో చర్చనీయాంశంగా మారింది. గులాంనబీ ఆజాద్ ను వదులుకునేందుకు సోనియా గాంధీకి ఇష్టం లేకపోయినా రాహుల్ గాంధీ మాత్రం సీనియర్ల తీరుపై అసంతృప్తిగా ఉన్నారు. దీంతో గులాంనబీ ఆజాద్ కాంగ్రెస్ లో కొనసాగుతారా? లేదా? అన్నది ఐదు రాష్ర్టాల ఎన్నికల ఫలితాల తర్వాత తేలనుందని చెబుతున్నారు.