బీహార్ లో లోక్ జనశక్తి పార్టీ ముసలం ఆరంభమైంది. అబ్బాయి చిరాగ్ పాశ్వాన్ పై ఎందుకు బాబాయ్ పశుపతి కుమార్ షరాన్ చిరాకు పడ్డారు. ఇదేదో యాదృచ్ఛికంగా జరిగిందేమీ కాదు. పథకం ప్రకారమే రాజకీయ కుట్ర జరుగుతోంది. దీని వెనుక పెద్ద పన్నాగం ఉందన్నట్లు తెలుస్తోంది. ఎల్జేపీ అధినేత రామ్ విలాస్ పాశ్వాన్ చనిపోయిన ఆయన కుమారుడు చిరాగ్ పాశ్వాన్ పగ్గాలు చేపట్టారు. పాశ్వాన్ బతికినన్ని రోజులు తమ్ముళ్లను తన సొంత వారిలాగే చూసుకున్నారు. వారి అవసరాలు తీర్చే వారు.
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ ను మెచ్చుకుంటూ తానోసారి మాట్లాడితే చిరాగ్ పట్టుబట్టి మరీ ఆ మాటల్ని వెనక్కి తీసుకునేలా చేయటంతో పశుపతి ఆవేదన రగిల్చింది. తాజాగా పార్టీ పగ్గాలు తాను చెప్పడమే కాకుండా పార్టీ పీఠం నుంచి చిరాగ్ ను తొలగించడం ద్వారా పశుపతి ఆనాడు జరిగిన దాడికి ప్రతీకారం తీర్చుకున్నాడు.
ఆనాడు మన ఇంటి నుంచి వెళ్లగొట్టిన చిరాగ్ ఇప్పుడు తన ఇంటి ముందు తచ్చాడడం గమనార్హం. చిరాగ్ మాటలే ఎల్జేపీ తాజా చిచ్చుకు తనపై తిరుగుబాటుకు కారణమయ్యాయి. లోక్ సభలో పశుపతి వర్గాన్ని గుర్తిస్తున్నట్లు లోక్ సభ సచివాలయం ప్రకటించిన నేపథ్యంలో పార్టీ పై పట్టు కోసం రెండు పక్షాలు ఎత్తులు వేస్తున్నాయి. తిరుగుబాటు చేసిన ఐదుగురు ఎంపీలు ఎల్జేపీ చీలిక వర్గం నేత చిరాగ్ మంగళవారం వేటు వేశారు. వారిని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు.
ఇప్పటికే పార్లమెంటరీ పార్టీ నేతగా ఆయనను తప్పించిన అసమ్మతి నేతలు తాజాగా ఈ మేరకు తీర్మానం చేశారు. సూరత్ ఖాన్ సింగ్ను పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమించారు. పార్టీ అధ్యక్ష ఎన్నికలు నిర్వహించే బాధ్యతలు ఆయనకు అప్పగించారు. దీంతో చిరాగ్ ఒంటరై పోయినట్టు కనిపిస్తుంది. పార్టీ కింది స్థాయి నాయకులు, కార్యకర్తలు మద్దతు తనకుందని మరోవైపు చిరాగ్ మంగళవారం ఓ ట్వీట్ చేశారు. పార్టీ తల్లిలాంటి పార్టీకి ద్రోహం చేయకూడదు బాబాయ్ సందేశం పంపించారు.