Homeజాతీయ వార్తలుMLC Elections : ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికలలో TPUS ఊహించని విజయానికి కారణలేంటి?

MLC Elections : ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికలలో TPUS ఊహించని విజయానికి కారణలేంటి?

MLC Elections : మధ్య తెలంగాణ.. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతం.. తెలంగాణలోని మధ్యతరగతి వర్గానికి ప్రతిబింబంగా ఉన్న . మధ్య వయస్కులు(దాదాపు 35 నుండి 60 సంవత్సరాల వయసు ఉన్నవారు) ఓటర్లుగా ఉన్న ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికల్లో ఊహించని విజయం. ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన…TPUS సాధించిన అపూర్వ విజయం.. దుబ్బాక, జిహెచ్ఎంసి హుజురాబాద్ ఎన్నికల్లో బిజెపి సాధించిన విజయాల కంటే ఎంతో విశిష్టమైనది.

బిజెపి వ్యతిరేక శక్తులు.. బిజెపి మరియు దాని మిత్ర సంస్థలు సాధించిన ప్రతి అద్భుత విజయాన్ని.. అనేక అసత్యాలు అర్థసత్యాలు మరియు కుతర్కాలతో అత్యల్పమైనవిగా చూపేందుకు అనేక కుట్రలు పన్నే పరంపర కొనసాగుతూనే ఉంటుంది. దుబ్బాక విజయాన్ని రఘునందన్ రావు వ్యక్తిగత విజయం గాను…. హుజురాబాద్ లో ఈటెల రాజేందర్ విజయాన్ని కేవలం సానుభూతితో సాధించిన గెలుపుగా…. జిహెచ్ఎంసి ఎన్నికల్లో సాధించిన విజయం కేవలం పట్టణ ప్రాంతపు పార్టీ విజయంగా.. దుష్ప్రచారం చేస్తూ బిజెపి ని వీలైనంత తక్కువ చూపిస్తూనే ఉంటారు.

కానీ జాతీయవాద వ్యతిరేక… ఇండియా శక్తులకు తెలంగాణ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తపస్ సాధించిన అద్భుత విజయాన్ని ఎలా అల్పమైనదిగా చూపించాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు.

ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక వర్గాల్లో తెలంగాణలో ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థలకు ఉన్న బలము అత్యంత స్వల్పము. తెలంగాణలో దాదాపు 70 సంవత్సరాలుగా ఉపాధ్యాయ సంఘాలు ప్రధానంగా వామపక్ష శక్తుల చేతుల్లోనే ఉన్నాయి. ఆ తర్వాత ఎప్పుడు ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటూ… లాబీయింగ్ చేసే పిఆర్టియు సంఘం కాలక్రమంలో బలపడింది. అయితే TPUS యొక్క బలం మొత్తం ఉపాధ్యాయుల్లో 10 శాతం లోపే ఉంటుంది. ఇప్పటివకు ఆంధ్రప్రదేశ్ -తెలంగాణ ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికల చరిత్రలో ఎన్నడూ కూడా…TPUS కనీసం రెండవ స్థానంలో కూడా నిలవలేదు. అత్యంత పటిష్టమైన వ్యవస్థ కలిగిన సిపిఎం అనుబంధ సంఘం UTF… ప్రస్తుత అధికార బిఆర్ఎస్ పార్టీకి … అనధికార అనుబంధ సంఘంగా కొనసాగుతున్న PRTU సంఘాలను పెద్దగా నిర్మాణం లేని తపస్ సంఘం ఓడించడం అంటే… అధికార టిఆర్ఎస్ పార్టీ , దాని మిత్రపక్షంగా కొనసాగుతున్న వామపక్ష పార్టీలను నిర్విద్వంగా తెలంగాణ ప్రజలు తిరస్కరించడం గానే భావించవలసి వస్తుంది.

సాదాసీదాగా బయటకు కనిపించే ఈ ఎన్నిక రాబోయే తెలంగాణ రాజకీయాలను పూర్తిగా మలుపు తిప్పగల స్థాయి కలదనడంలో ఎలాంటి సందేహం లేదు. మునుగోడు ఎన్నికలలో పోరాడి ఓడిపోయి స్వల్పంగా ఢీలాపడిన బిజెపికి ఈ ఎన్నిక అద్భుతమైన పునరుత్తేజం కలిగించగలదు. త్యాగం ,పోరాట పటిమ కలిగిన బండి సంజయ్ నాయకత్వంపై అహంకారం గల కొందరు నేతలు అవాకులు, చెవాకులు పేలుతున్న పరిస్థితులను మార్చి బండి సంజయ్ నాయకత్వాన్ని మరింత పటిష్టం చేయడం ఖాయం. దాదాపు 50 శాతం జనాభా ఉన్న ప్రాంతంలో… పరిపక్వత గల మధ్య తరగతి ప్రజలు మధ్య వయస్కులు ఓటు వేసిన ఈ ఎన్నికను అత్యంత శాస్త్రీయమైన ఒక సమగ్ర ఎన్నికల సర్వే గానే భావించవలసి ఉంటుంది. ఈ ఎన్నికలో TPUS సాధించిన విజయం వచ్చే శాసనసభ సాధారణ ఎన్నికల్లో బిజెపి సాధించబోయే ఘన విజయానికి అసలు సిసలు సంకేతంగా భావించవచ్చు..

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
Exit mobile version