BJP Secret Surveys: భారతీయ జనతా పార్టీ తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించింది. ముగ్గురు ఎంపీలు, జీహెచ్ఎంసీ ఎన్నికలు, దుబ్బాక, హుజురాబాద్ ఎన్నికల ఫలితాలు అనుకూలంగా రావడంతో కేంద్ర అధిష్టానం రాష్ట్రంపై ఫోకస్ పెట్టింది. కష్టపడితే తెలంగాణలో కూడా పాగా వేయడం పెద్ద విషయమేమీ కాదని వారికి అర్థమైంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ బాధ్యతలు చేపట్టాక రాష్ట్రంలో పరిస్థితిలో చాలా మార్పు వచ్చింది. దీంతో తమకు అనుకూలంగా మలుచుకోవాలని భావిస్తున్నారు. అందుకే రాబోయే ఎన్నికల్లో పార్టీని ఎలాగైనా అధికారంలోకి తీసుకురావాలని శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు.

పార్టీలో కొంతమంది నామమాత్రంగానే పనిచేస్తున్నట్లు నేతల దృష్టికి వస్తోంది. పార్టీపై అభిమానంతో సేవలు చేసే వారి సంఖ్య తగ్గుతోంది. ఫలితంగానే మంచి రిజల్ట్స్ రావడం లేదని తెలుస్తోంది. నేతలు పార్టీ కోసం పనిచేయాల్సిందేనని చెబుతున్నా నిర్లక్ష్యం వీడటం లేదు. దీంతో నేతల తీరుపై సర్వేలు చేయిస్తున్నారు. పార్టీ కార్యక్రమాల్లో ఎలా పాల్గొంటున్నారనే దానిపై ఇప్పటికే నేతల వద్ద పలువురి చిట్టాలున్నట్లు చెబుతున్నారు. రాబోయే ఎన్నికల్లో పార్టీని విజయమార్గంలో నడిపించాలంటే అందరి సహకారం అవసరమే. దీన్ని గుర్తించి అందరు బద్దకం వీడి పార్టీ కోసం పనిచేయాల్సిందేనని సూచిస్తున్నారు.
Also Read: Sudigali Sudheer Jabardast Re-Entry: జబర్ధస్త్ లోకి సుడిగాలి సుధీర్ రీఎంట్రీ వెనుక ఉన్నదెవరు?
పార్టీలో అనుబంధ సంఘాల పనితీరు బాగా లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మోర్చాలు చురుకుగా సాగడం లేదు. ఫలితంగా పార్టీకి ప్రయోజనం రావడం లేదు. ఈ నేపథ్యంలో అధిష్టానం గుర్రుగా ఉంది. నేతల తీరుతో ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పార్టీ కోసం అందరు సమష్టిగా కష్టపడితే విజయం సునాయాసమే అని తెలిసినా కొందరిలో నిర్లిప్తత చోటుచేసుకోవడం బాధాకరం. దీంతో పార్టీకి నష్టం కలుగుతోందని తెలుస్తోంది. నేతల పనితీరుపై సర్వే చేయిస్తూ ఎవరు ఎంత మేర పనిచేస్తున్నారో తెలుసుకుంటున్నారు. దీంతో నేతల్లో భయం పట్టుకుంది.
[…] […]
[…] […]