Ganga Vilas : అచేతు హిమాచల భారతం అంతటా ఎన్నో నదులు, ఉపనదులు, కాలువలు.. మన దేశం ఇంత పచ్చగా ఉందంటే కారణం ఆ హిమాలయాలు.. అందులో పుట్టిన నదులే. దేశ ఉత్తరం నుంచి తూర్పున బంగాళాఖాతం వరకూ ఈ నదీమతల్లులు పారుతూ మనదేశాన్ని సస్యశ్యామలం చేస్తూనే ఉన్నాయి. అయితే ఈ నదులను ఇప్పటికీ మనం సరిగ్గా వాడుకోవడం లేదు. పర్యాటకాన్ని పట్టించుకోవడం లేదు. కశ్మీర్ నుంచి బెంగాల్ వరకూ పారే గంగానదిని సరిగ్గా వాడుకోవడం లేదు. అయితే మోడీ సర్కార్ వచ్చాక మన సంస్కృతికి పెద్దపీట వేస్తోంది. పర్యాటకాన్ని ప్రోత్సహించేలా.. ప్రపంచ వారసత్వ ప్రదేశాలకు గుర్తింపునిచ్చేలా.. మన దేశ ఔన్నత్యాన్ని చాటేలా ఏర్పాట్లు చేస్తోంది. ఈక్రమంలోనే ప్రపంచంలోనే అత్యంత పొడవైన రివర్ క్రూయిజ్ ‘గంగా విలాస్’ను రూపొందించింది.

జనవరి 13న ప్రపంచంలోనే అత్యంత పొడవైన లగ్జరీ రివర్ క్రూయిజ్ “గంగా విలాస్”ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఈ క్రూయిజ్ షిప్ ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నుండి అస్సాంలోని దిబ్రూఘర్ వరకు 50 రోజుల్లో 3,200 కిలోమీటర్లు ప్రయాణించనుంది. ఈ క్రూయిజ్ భారతదేశం మరియు బంగ్లాదేశ్‌లోని 27 నదీ వ్యవస్థల గుండా వెళుతుంది. పర్యాటకులకు ప్రపంచ వారసత్వ ప్రదేశాలతో సహా 50 కంటే ఎక్కువ పర్యాటక ప్రదేశాలకు తీసుకువెళతారు.
ప్రపంచంలోనే ఒకే నదిలో నౌక ద్వారా సాగే అతిపెద్ద నది ప్రయాణం ఇదే కావడం గమనార్హం. ‘గంగా విలాస్’ క్రూయిజ్ షిప్ మార్చి 1న అస్సాంలోని దిబ్రూఘర్ జిల్లాలోని బోగీబీల్‌కు చేరుకోవడానికి ముందు కోల్‌కతా , ఢాకా వంటి ప్రముఖ నగరాల గుండా వెళుతుంది. అలాగే సుందర్‌బన్స్ డెల్టా అడవులు.. కజిరంగా నేషనల్ పార్క్‌తో సహా జాతీయ పార్కులు , అభయారణ్యాల గుండా ఈ భారీ క్రూయిజ్ ప్రయాణం అత్యంత ఆహ్లాదభరింతంగా సాగుతుంది.
నవంబర్‌లో ఓడరేవులు, షిప్పింగ్ , జలమార్గాల మంత్రి సర్బానంద సోనోవాల్ ట్వీట్ చేస్తూ “ప్రపంచంలోనే అతి పొడవైన రివర్ క్రూయిజ్ వచ్చే ఏడాది జనవరిలో తన ప్రయాణాన్ని ప్రారంభించనుంది. గంగా విలాస్ పవిత్ర వారణాసి నుండి బంగ్లాదేశ్ మీదుగా దిబ్రూగఢ్‌కు 4,000 కి.మీలు ప్రయాణించనుంది. భారతదేశంలోని రెండు గొప్ప నదులైన గంగా, బ్రహ్మపుత్రలలో వేల కి.మీలు సాగనుంది.” అంటూ ట్వీట్ చేశాడు.

-గంగా విలాస్ ప్రత్యేకత ఏమిటి?
ప్రపంచంలోనే అత్యంత పొడవైన లగ్జరీ క్రూయిజ్ షిప్ ‘గంగా విలాస్’. ఇందులో సాంస్కృతిక కార్యక్రమాలు, లైవ్ మ్యూజిక్, జిమ్, స్పా, ఓపెన్-ఎయిర్ అబ్జర్వేషన్ డెక్, పర్సనలైజ్డ్ బట్లర్ సర్వీస్ వంటి అనేక ఆకర్షణీయమైన ఫీచర్లను పొందుపరిచారు. అధికారిక సమాచారం ప్రకారం క్రూయిజ్ లో 80 మంది ప్రయాణికులు. 18 సూట్‌లను కలిగి ఉంది. గంగా విలాస్ క్రూయిజ్ ప్రత్యేకమైన డిజైన్ తో భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నిర్మించబడింది. ఈ క్రూయిజ్ షిప్ కోల్‌కతాలోని హుగ్లీ నది వెంట వివిధ ప్రముఖ గమ్యస్థానాల గుండా వారణాసి వరకూ గంగా నది మీదుగా ప్రయాణిస్తుంది.
-సమయం , మార్గం
అధికారిక వెబ్‌సైట్ ప్రకారం.. గంగవిలాస్ నౌక వారణాసి నుండి తన ప్రయాణాన్ని ప్రారంభించి 8వ రోజు పాట్నా చేరుకుంటుంది. లగ్జరీ షిప్ బక్సర్, రామ్‌నగర్ -ఘాజీపూర్ పట్టణాల మీదుగా వెళుతుంది. క్రూయిజ్ ఫరక్కా, ముర్షిదాబాద్ మీదుగా 20వ తేదీన కోల్‌కతా చేరుకుంటుంది. మరుసటి రోజు ఈ భారీ ఓడ ఢాకాకు బయలుదేరి బంగ్లాదేశ్ సరిహద్దులోకి ప్రవేశిస్తుంది. అక్కడ అది తదుపరి 15 రోజులు ఉంటుంది. తిరిగి వచ్చినప్పుడు ఓడ గౌహతి మీదుగా ప్రయాణించి సిబ్‌సాగర్ గుండా ప్రయాణించి దిబ్రూఘర్‌లో తన చివరి గమ్యస్థానానికి చేరుకుంటుంది.
The world's longest river cruise will commence its journey in Jan next year. Ganga Vilas, will set sail from sacred Varanasi to Dibrugarh via Bangladesh covering 4,000 km on the two greatest rivers of India, Ganga & Brahmaputra. Watch 🎥 pic.twitter.com/1buzy8ISig
— Sarbananda Sonowal (@sarbanandsonwal) November 12, 2022