https://oktelugu.com/

హవ్వా.. బిగ్‌బాస్‌ కంటెస్టెంట్ల కులాలు వెతికారంట

కులం మీకు ఏమిచ్చింది.? అంటే.. పేరు ఇచ్చింది.. పరపతి ఇచ్చింది. సమాజంలో ఇప్పుడు క్రేజ్ కూడా ఇస్తోందని అంటున్నారు పలువురు సెలెబ్రెటీలు.. తెలంగాణలో పెద్దగా కులపట్టింపులు లేకున్నా.. ఏపీలో మాత్రం ఈ కులాల కొట్లాట ఎక్కువ. అందుకే అక్కడ రాజకీయం రెడ్డి, కమ్మ, కాపులుగా చీలిపోయింది. రాజకీయాల్లోనే కాదు.. ఇప్పుడు సినిమాలు.. దాన్ని దాటి బిగ్ బాస్ వరకు ఈ కుల కుంపట్లు పాకాయి.. నిజంగా నిజమిదీ.. Also Read: గంగవ్వతో ‘బిగ్ బాస్’ ఆట.. చూడాల్సిందే..! […]

Written By:
  • NARESH
  • , Updated On : September 8, 2020 / 07:32 PM IST
    Follow us on

    కులం మీకు ఏమిచ్చింది.? అంటే.. పేరు ఇచ్చింది.. పరపతి ఇచ్చింది. సమాజంలో ఇప్పుడు క్రేజ్ కూడా ఇస్తోందని అంటున్నారు పలువురు సెలెబ్రెటీలు.. తెలంగాణలో పెద్దగా కులపట్టింపులు లేకున్నా.. ఏపీలో మాత్రం ఈ కులాల కొట్లాట ఎక్కువ. అందుకే అక్కడ రాజకీయం రెడ్డి, కమ్మ, కాపులుగా చీలిపోయింది. రాజకీయాల్లోనే కాదు.. ఇప్పుడు సినిమాలు.. దాన్ని దాటి బిగ్ బాస్ వరకు ఈ కుల కుంపట్లు పాకాయి.. నిజంగా నిజమిదీ..

    Also Read: గంగవ్వతో ‘బిగ్ బాస్’ ఆట.. చూడాల్సిందే..!

    సెలబ్రిటీలకు సంబంధించి ఎవరైనా వారి సక్సెస్‌ పాయింట్స్‌ ఏంటని గమనిస్తే.. వారు ఎలా ఆ స్థాయికి వచ్చారు..వారికి రోల్‌ మోడల్‌ ఎవరు.. తాము వారిని ఎలా ఇన్‌స్పిరేషన్‌గా తీసుకోవాలని నెట్‌లో సెర్చ్‌ చేస్తుంటారు. కానీ.. మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం విభిన్నం. కులం పిచ్చి తొలగడం లేదు. సక్సెస్‌ అయిన వారి హిస్టరీ చూడకుండా.. వారి కులాలను వెతుకుతున్నారు.

    గతంలో బ్యాడ్మింటన్‌ స్టార్‌‌ పీవీ సింధు కూడా ఒలింపిక్స్‌లో సంచలన ప్రదర్శనతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఆదరణ పొందింది. ఆ సందర్భంలో దేశవ్యాప్తంగా క్రీడాభిమానులు సింధు గురించి విశేషాలు తెలుసుకోడానికి ఇంట్రెస్ట్‌ చూపారు. కానీ.. మన తెలుగు వారు మాత్రం ఆమె కులం గురించి  ఇంట‌ర్‌‌నెట్‌లో వెతికారు. ఆమె కులం సెర్చ్ చేయ‌డం అప్పట్లో హాట్ టాపిక్‌గా మారింది. గూగుల్‌లో సింధు అని పేరు కొట్టగానే పక్కన క్యాస్ట్‌ క్లిక్‌ చేస్తే డీఫాల్ట్‌ వచ్చింది. దీంతో తీవ్ర విమ‌ర్శలు వచ్చాయి. అయినా.. మ‌నోళ్ల తీరులో మార్పు ఇప్పటికీ మార్పు రావడం లేదు.

    Also Read: జేపీ మృతి తీరని లోటు.. ప్రముఖుల ట్వీట్లు

    సోష‌ల్ మీడియా జోరు పెరిగాక ఈ కుల సంబంధిత చ‌ర్చలు, వాదోప‌వాదాలు మ‌రీ ఎక్కువయ్యాయి. తాజాగా బిగ్ బాస్ షో మొద‌లైన నేప‌థ్యంలో అందులో పార్టిసిపెంట్ల కులాల గురించి ఇప్పుడు చ‌ర్చ న‌డుస్తుండ‌టం గ‌మ‌నార్హం. యాంక‌ర్ లాస్య హౌస్‌లోకి అడుగు పెట్టగానే ఆమె రెడ్డి సామాజిక వ‌ర్గానికి చెందింద‌ని.. ఆమెకు స‌పోర్ట్ చేద్దామ‌ని ఒక వ‌ర్గం వాళ్లు సోష‌ల్ మీడియాలో పోస్టులు పెట్టేశారు. మ‌రోవైపు గంగ‌వ్వ మున్నూరు కాపు అని.. ఆమెను గెలిపించుకుందామ‌ని ఇంకో వ‌ర్గం ప్రచారం మొద‌లుపెట్టింది.

    మిగ‌తా పార్టిసిపెంట్లలో కొంద‌రి కులాలు కూడా వెలికితీసే ప్రయత్నం చేశారంట. ఇది చూసి తెలుగు రాష్ట్రాల జ‌నాల్లో కుల పిచ్చి ఈ స్థాయికి చేరిందేందంటూ ట్రోల్‌ నడుస్తోంది. మ‌న‌వాళ్లు మార‌ర‌ని, ఈ జాఢ్యం ఎప్పటికి వ‌దులుతుందో తెలియకుండా పోయిందని పెదవి విరుస్తున్నారు.