హమ్మయ్య…. విజయసాయికి ఆ టెన్షన్ తీరినట్లే….?

ఏపీలో అధికారంలోకి వచ్చిన రోజు నుంచి జగన్ సర్కార్ ను, ఆ పార్టీ నేతలను పిటిషన్లు ఇబ్బందులు పెడుతున్న సంగతి తెలిసిందే. జగన్ సర్కార్ ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకున్నా హైకోర్టులో దాఖలైన పిటిషన్ల వల్ల ఆ నిర్ణయాలు అమలు కావడం లేదు. కొన్ని నెలల క్రితం వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి అనర్హత వేటు వేయాలని బీజేపీ నేతలు పిటిషన్ దాఖలు చేశారు. Also Read : జగన్ ను ఢీకొంటున్న ఒకే ఒక్కడు […]

Written By: Navya, Updated On : September 9, 2020 9:59 am

vijaysai relaxed from disqualification petition

Follow us on

ఏపీలో అధికారంలోకి వచ్చిన రోజు నుంచి జగన్ సర్కార్ ను, ఆ పార్టీ నేతలను పిటిషన్లు ఇబ్బందులు పెడుతున్న సంగతి తెలిసిందే. జగన్ సర్కార్ ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకున్నా హైకోర్టులో దాఖలైన పిటిషన్ల వల్ల ఆ నిర్ణయాలు అమలు కావడం లేదు. కొన్ని నెలల క్రితం వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి అనర్హత వేటు వేయాలని బీజేపీ నేతలు పిటిషన్ దాఖలు చేశారు.

Also Read : జగన్ ను ఢీకొంటున్న ఒకే ఒక్కడు ఇతడు!

అయితే ఎట్టకేలకు ఈ పిటిషన్ విషయంలో విజయసాయిరెడ్డికి ఊరట లభించింది. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అనర్హత పిటిషన్ ను కొట్టివేయడంతో పాటు విజయసాయిరెడ్డికి అనర్హత వర్తించదని పేర్కొన్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్ ను సంప్రదించి విజయసాయిరెడ్డి లాభదాయకమైన పదవి నిర్వహిస్తున్నారని వచ్చిన సమాచారం గురించి వివరాలు అడిగి తెలుసుకుని అనర్హత పిటిషన్ ను గవర్నర్ కొట్టివేశారు.

కేంద్ర ఎన్నికల సంఘం న్యాయస్థానాల తీర్పు, పార్లమెంటు అనర్హత నిరోధక చట్టం తీర్పుల ప్రకారం విజయసాయిరెడ్డికి అనర్హత వర్తించదని కేంద్రం రాష్ట్రపతికి తెలియజేసింది. మరోవైపు తాను ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా జీవో నంబర్ 75 ప్రకారం కొనసాగుతున్నప్పటికీ తాను జగన్ సర్కార్ నుంచి జీతం రూపంలో ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని విజయసాయిరెడ్డి డిక్లరేషన్ లో పేర్కొన్నారు.

సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన కొత్తలో విజయసాయిరెడ్డిని ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమించారు. అయితే రెండు వారాలకే ఆ జీవోను జగన్ సర్కార్ ఆ జీవోను రద్దు చేసింది. విజయసాయిరెడ్డికి ఇచ్చిన పదవి లాభదాయక పదవుల చట్టం నిబంధనలను సవరించకుండా ఇచ్చినది కావడంతో జగన్ సర్కార్ నిబంధనలను సవరించి కొత్త జీవో విడుదల చేసింది. ఆ కొత్త జీవోనే ఇప్పుడు విజయసాయిరెడ్డిని కాపాడిందని చెప్పాలి.

Also Read : బాబుకు షాక్.. అమరావతిపై జగన్ సీబీ‘ఐ’!