కాగ్ రిపోర్టు ఏమైనట్లు..? ఎందుకు ప్రవేశపెట్టలేదు..?

ప్రభుత్వానికి చెందిన ఆదాయం, అప్పులను చూపే కంప్ట్రోలర్ అడిట్( కాగ్)ను ఏపీ ప్రభుత్వం రిలీజ్ చేయలేదు. గురువారం ఒక్కరోజు అసెంబ్లీని నిర్వహించిన అధికార పక్షం కాగ్ నివేదికను బహిర్గతపర్చకపోవడంతో ప్రతిపక్ష నేతలు విమర్శలు చేస్తున్నాయి. బడ్జెట్ పై సమావేశం నిర్వహించిన ప్రభుత్వం కాగ్ నివేదికను సమర్పించకపోవడంపై అనేక అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కాగ్ నివేదిక ప్రైవేట్ వ్యవహారం కాదని, అది ప్రజలకు సంబంధించిందని అందువల్ల దానిని బయటపెట్టాలనే డిమాండ్ వస్తోంది. 2019లో నాటి రెవెన్యూ సెక్టార్ కాగ్ రిపోర్టును […]

Written By: NARESH, Updated On : May 20, 2021 6:43 pm
Follow us on

ప్రభుత్వానికి చెందిన ఆదాయం, అప్పులను చూపే కంప్ట్రోలర్ అడిట్( కాగ్)ను ఏపీ ప్రభుత్వం రిలీజ్ చేయలేదు. గురువారం ఒక్కరోజు అసెంబ్లీని నిర్వహించిన అధికార పక్షం కాగ్ నివేదికను బహిర్గతపర్చకపోవడంతో ప్రతిపక్ష నేతలు విమర్శలు చేస్తున్నాయి. బడ్జెట్ పై సమావేశం నిర్వహించిన ప్రభుత్వం కాగ్ నివేదికను సమర్పించకపోవడంపై అనేక అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కాగ్ నివేదిక ప్రైవేట్ వ్యవహారం కాదని, అది ప్రజలకు సంబంధించిందని అందువల్ల దానిని బయటపెట్టాలనే డిమాండ్ వస్తోంది.

2019లో నాటి రెవెన్యూ సెక్టార్ కాగ్ రిపోర్టును ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రప్రసాద్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అయితే సంవత్సరానికి సంబంధించిన రిపోర్టును అసెంబ్లీలో ప్రవేశపెట్టకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఆర్థిక పరంగా ప్రభుత్వం ఎన్ని ఖర్చులు పెట్టిందో.. ప్రభుత్వానికి ఏ రకంగా ఆదాయం వచ్చిందో తెలిపే నివేదిక కచ్చితంగా బయటపెట్టాలని అంటున్నారు.

గతేడాది కాలంగా ఆర్థిక పరంగా ఎన్నో అవకతవకలున్నాయని ఫిర్యాదులు ఉన్నాయి. 42వేల కోట్ల బిల్లులకు సంబంధించి అనేక అభ్యంతరాలున్నాయని కాగ్ ప్రభుత్వం ముందుకు వచ్చినా దీనిపై సమాధానం ఇవ్వడానికి ప్రభుత్వం అనేక తంటాలు పడిందని మీడియాలో ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో కాగ్ రిపోర్టు ఇవ్వకపోవడంపై ఆర్థిక మంత్రి బుగ్గనపై విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా కాగ్ రిపోర్టును బహిర్గతం చేయాలని కోరుతున్నారు.