https://oktelugu.com/

కరోనా కట్టడే మా లక్ష్యం

కరోనా ఉధృతి తగ్గించేందుకు తగు చర్యలు తీసుకుంటున్నామని ఏపీ సీఎం జగన్ చెప్పారు. బడ్జెట్ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ కోవిడ్ నివారణకు తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. కరోనా పరిస్తితులపై ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. కరోనాను ఆరోగ్య శ్రీలో చేర్చారు. 2019కి ముందు వెయ్యి కేసులకే ఆరోగ్య శ్రీలో అవకాశముండగా ప్రస్తుతం దాన్ని 2400 కేసులకు విస్తరించామన్నారు. 104, 108 వాహనాల ద్వారా రాష్ర్టంలో ఆరోగ్య సేవలందిస్తున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఏఎన్ఎంలను నియమించారు. […]

Written By:
  • NARESH
  • , Updated On : May 20, 2021 / 06:37 PM IST
    Follow us on

    కరోనా ఉధృతి తగ్గించేందుకు తగు చర్యలు తీసుకుంటున్నామని ఏపీ సీఎం జగన్ చెప్పారు. బడ్జెట్ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ కోవిడ్ నివారణకు తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. కరోనా పరిస్తితులపై ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. కరోనాను ఆరోగ్య శ్రీలో చేర్చారు. 2019కి ముందు వెయ్యి కేసులకే ఆరోగ్య శ్రీలో అవకాశముండగా ప్రస్తుతం దాన్ని 2400 కేసులకు విస్తరించామన్నారు. 104, 108 వాహనాల ద్వారా రాష్ర్టంలో ఆరోగ్య సేవలందిస్తున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఏఎన్ఎంలను నియమించారు. విలేజ్ క్లినిక్ లను అందుబాటులోకి తెచ్చారు. ప్రతి మండలంలో ఆరోగ్య సేవలందించడానికి ప్రతి పీహెచ్ సీలో ఇద్దరు వైద్యులు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.

    కరోనా కట్టడికి..
    కరోనా ప్రపంచానికి సవాలు విసురుతోంది. ఈ పరిస్థితిలో రోజుకు లక్ష పరీక్షలు చేస్తున్నారు. మొదటి వేవ్ లో 261 ఆస్పత్రులు, ఇప్పుడు 649 ఆస్పత్రుల్లో సేవలందిస్తున్నారు. కరోనా రోగులకు 27,400 బెడ్లు అందుబాటులోకి తెచ్చారు. ప్రస్తుతం వాటి సంఖ్య గణనీయంగానే పెరిగింది. కోవిడ్ సెంటర్లు కూడా వెలిశాయి. కరోనాను ఆరోగ్య శ్రీలో చేర్చి వైద్యం అందిస్తున్న రాష్ర్టం ఏపీనే. కోవిడ్ కోసం రూ.2,229 కోట్లు ఖర్చు చేశారు. కొత్తగా బ్లాక్ ఫంగస్ సైతం ఆరోగ్య శ్రీలో చేర్చారు. దీని కోసం 17 ఆస్పత్రులను గుర్తించారు.

    ఆక్సిజన్ రవాణా
    ఒడిశా నుంచి ఆక్సిజన్ నిల్వలు తెప్పిస్తున్నారు. రోజుకు 4 నుంచి 6 ట్య్యాంకర్లు విమానాల్లో రవాణా చేస్తున్నారు. క్రయోజెనిక్ ట్యాంకర్లు, ఆక్సిజన్ షిప్ లలో దిగుమతి చేస్తున్నారు. 53 ఆస్పత్రతుల్లో ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

    వ్యాక్సినేషన్ ప్రక్రియ
    రాష్ర్టంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. 18-45 ఏళ్ల లోపు వారికి వ్యాక్సినేషన్ వేయాలంటే 2 కోట్ల మందికి 4 కోట్ల డోసులు కావాల్సి ఉంది. రాష్ర్టానికి 7 కోట్ల డోసులు అవసరం ఉన్నాయి. ఇప్పటి వరకు 76 లక్షల డోసులు మాత్రమే వచ్చాయి.