Tirumala Tirupati: తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతకు భంగం కలుగుతోంది. అనుయాయులకు అందలాలు ఎక్కిస్తూ సామాన్యులకు మాత్రం నిబంధనల మంత్రం పాటిస్తున్నారు. దీనిపై ఇప్పుడే కాదు గతంలోనూ విమర్శలు వచ్చాయి. కానీ ప్రభుత్వం నిక్కచ్చిగా వ్యవహరించకపోవడంతో విమర్శలపర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా ఏపీ మంత్రి అప్పలరాజు తన అనుచరులు 150 మందితో వీఐపీ దర్శనం చేసుకోవడం విమర్శలకు తావిచ్చింది. దీనిపై అందరి నుంచి ప్రశ్నలు వస్తున్నాయి. అలా ఎలా చేస్తారనే డిమాండ్లు వస్తున్నాయి. సామాన్య భక్తులకేమో క్యూలైన్లు ఇతరులకేమో వీఐపీ పాసులు ఇవ్వటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

గతంలో ఉన్న ప్రభుత్వాలు కూడా ఇలాంటి విమర్శలు ఎదుర్కొన్నా ప్రస్తుతం వచ్చిన చిక్కు ప్రభుత్వానికి కొత్త చిక్కులే తెచ్చిపెట్టనుందని తెలుస్తోంది. వైసీపీ నేతల్లోనే విమర్శలు వస్తున్నాయి. అధికార పార్టీ కావడంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే ఎవరు సహించరని భక్తులు హెచ్చరిస్తున్నా పెడచెవిన పెడుతున్నారు. కామ్ గా ఎవరి పనులు వారు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వీఐపీ లైన్లో మంత్రి అప్పలరాజు తన అనుచరులతో దర్శనం చేసుకోవడం వివాదాస్పదమైంది.
Also Read: Bimbisara Heroine Samyuktha Menon: ‘బింబిసార’ హీరోయిన్ తో హీరో ధనుష్ గొడవ.. అసలేం జరిగిందంటే ?
తిరుమల శ్రీవారు దేవుడు వీఐపీల దేవుడా అనే వరకు వెళ్లింది. దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ విధానాలతో భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. ప్రభుత్వంలోని మంత్రులే ఇలా వివాదాలు సృష్టిస్తే ఇక ఎవరు సమాధానం చెబుతారనే వాదనలు వస్తున్నాయి. దీనిపై ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు రావడం సహజమే. కానీ మంత్రి మాత్రం తాను భక్తుల క్యూలైన్లోనే దర్శనం చేసుకున్నానని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించలేదని చెప్పడం గమనార్హం.

శ్రీవారి దర్శనం విషయంలో ఎప్పుడు గొడవలు రావడం తెలిసిందే. ప్రభుత్వంలోని వారే చిక్కులు తెస్తూ ప్రభుత్వానికి మచ్చ తెస్తున్నారు. దీంతో వైసీపీ ప్రబుత్వం ప్రజా ప్రభుత్వం కాదు ప్రజలకు కీడు చేసే ప్రభుత్వంగా పేరు తెచ్చుకోవడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే వైసీపీ నేతలే తప్పులు చేయడం పరిపాటిగా మారుతోంది. దీనికి ప్రభుత్వం కూడా వంత పాడటం విశేషం. భవిష్యత్ లో వైసీపీకి ఇదో పెద్ద మైనస్ కానుంది. సామాన్యుల కోసం దేవుడి సేవలను సైతం పక్కదారిలో చేసుకుంటూ ప్రజలకు ఇబ్బందులు కలిగించడం ఎంతవరకు సమంజసం అనే వాదనలు వస్తున్నాయి. దీనిపై ప్రభుత్వానికే తెలియాలి అనే ధోరణి అందరిలో రావడం తెలిసిందే.
Also Read: ‘Thank you’ 7 Days Collections: ‘థాంక్యూ’ 7 డేస్ కలెక్షన్స్.. లెక్కలు చూస్తే ఆశ్చర్యపోతారు !
[…] Also Read: Tirumala Tirupati: తిరుమలలో ఏంటీ అపచారం.. ? […]