ఏపీ హైకోర్టు ప్రధానన్యాయమూర్తిగా అరూప్ గోస్వామి ప్రమాణం

  ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అరూప్ గోస్వామి బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ సీజేతో ప్రమాణం చేయించారు. అసోంకు చెందిన అరూప్ 1985లో న్యాయవాదిగా మారారు. ఆ తరువాత 2012లో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2019లో సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన ఆయన తాజాగా ఆంధ్రప్రదేశ్ కు బదిలీపై వచ్చారు. కాగా ప్రమాణస్వీకారం కార్యక్రమంలో న్యాయవాదులు, ప్రజాప్రతినిధులు,పార్లమెంట్ సభ్యులు పాల్గొన్నారు.

Written By: Suresh, Updated On : January 6, 2021 11:00 am
Follow us on