West Bengal Murshidabad Tension: పశ్చిమ బెంగాల్ కొన్ని రోజులుగా నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ఈ ఏడాది రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ క్రమంలో ఇటీవల ఐప్యాక్ కార్యాలయంపై ఈడీలు.. వాటిని సీఎం మమతా అడ్డుకోవడం, ఆందోళన చేయడం తెలిసిందే. అంతకముందు సర్‌కు వ్యతిరేకంగా మమత ఉద్యమం చేశారు. ఇప్పుడు ముర్శిదాబాద్‌లో అల్లర్లు చెలరేగాయి. వందేభారత స్లీపర్ రైలు కూడా బెంగాల్ నుంచే మొదలైంది. అయితే ముర్శిదాబాద్ అల్లర్లు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జార్ఖండ్ నుంచి వలస వచ్చిన కార్మికుడు అలాఉద్దీన్ షేక్ మరణంతో ఈ అల్లర్లు మొదలయ్యాయి. స్థానికులు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించి బెంగాలీ మాట్లాడే కార్మికుల్లో భయం మొదలైంది.
బిహార్‌లో దాడి..
బిహార్‌లో మరొక స్థానిక కార్మికుడు అనిసూర్ షేక్‌పై దారుణంగా దాడి చేశారనే ప్రత్యేక వార్తలు వెలుగులోకి వచ్చాయి. ఈ సంఘటనలు బెంగాలీ కార్మికులపై జరుగుతున్న దాడులకు చిహ్నంగా మారాయి. దీంతో ప్రజల్లో కోపం మరింత పెరిగింది. పెద్ద ఉద్యమంగా మారింది.
రహదారులు మూసివేత.. రైళ్లు నిలిపవేత
ప్రజల ఆందోళనలతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. దీంతో జాతీయ రహదారి–12ను మూసివేశారు. ఆందోళనకారులు రైళ్లను అడ్డుకుంటున్నారు. దీంతో ఉత్తర, దక్షిణ బెంగాల్ మధ్య నడిచే రైళ్లను నిలిపివేశారు. వేలాది మంది ప్రయాణికులు చిక్కుకున్నారు. బారువా మోర్‌లో రోడ్లను దిగ్బంధించారు. దీంతో ట్రాఫిక్ పూర్తిగా ఆగిపోయింది.
ఆస్తులపై దాడులు..
ఆందోళనకారులు నగరాల్లో రైల్వే గేట్లు, సౌకర్యాలపై కార్మికులు దాడి చేశారు. రైలులను ఆపడానికి ప్రయత్నించారు. పోలీసులు లాఠీఛార్జ్‌లతో గుండెలను అదుపులోకి తెచ్చారు. బెల్డంగా ప్రాంతంలో ఉద్రిక్తతలు మరిత పెరిగాయి. మరోవైపు బీజేపీ ఈ ఆందోళనలను దేశ భద్రతకు ముప్పుగా భావిస్తోంది. ప్రభుత్వ వైఫల్యంతోనే ఇలా జరుగుతోందని ఆరోపించింది. ముర్శిదాబాద్ బెంగాల్ నుంచి సిలిగూరి, ఈశాన్య రాష్ట్రాలకు ప్రధాన మార్గంగా ఉండటంతో, ఎన్‌హెచ్–12పై అడ్డంకి వ్యూహాత్మకంగా ప్రమాదకరం. సిలిగూరి కారిడార్ (చికెన్‌స్ నెక్) రక్షణకు ఆందోళనలు తలెత్తాయి.
స్థానికులు, కొన్ని మీడియా సంస్థలు బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వచ్చిన వ్యక్తులు ఈ హింసలకు కారణమని ఆరోపిస్తున్నారు. వారు రహదారులు, రైల్వేల అడ్డంకికి సహకరించారని చెబుతున్నారు. అధికారులు ఈ ఆరోపణలను ధ్రువీకరించడం లేదు.
