West Bengal Bypolls: మమత మళ్లీ గెలుస్తుందా? లేదా? పట్టుకున్న బెంగ

West Bengal Bypolls: బెంగాల్ లో ఉప ఎన్నికలకు ఎన్నికల సంఘం పచ్చ జెండా ఊపింది. దీంతో పార్టీలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. విజయ తీరాలు చేరుకోవాలని భావిస్తున్నాయి. ఈనేపథ్యంలో సీఎం మమతా బెనర్జీ విజయం సాధించాలని తాపత్రయపడుతున్నారు. గత ఎన్నికల్లో నందిగ్రామ్ నుంచి పోటీ చేసినా ఓటమి పాలు కావడంతో ఈసారి అలా జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గతానుభవాన్ని దృష్టిలో పెట్టుకుని కార్యకర్తలు దిశా నిర్దేశం చేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ఘన విజయం […]

Written By: Srinivas, Updated On : September 15, 2021 10:29 am
Follow us on

West Bengal Bypolls: బెంగాల్ లో ఉప ఎన్నికలకు ఎన్నికల సంఘం పచ్చ జెండా ఊపింది. దీంతో పార్టీలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. విజయ తీరాలు చేరుకోవాలని భావిస్తున్నాయి. ఈనేపథ్యంలో సీఎం మమతా బెనర్జీ విజయం సాధించాలని తాపత్రయపడుతున్నారు. గత ఎన్నికల్లో నందిగ్రామ్ నుంచి పోటీ చేసినా ఓటమి పాలు కావడంతో ఈసారి అలా జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గతానుభవాన్ని దృష్టిలో పెట్టుకుని కార్యకర్తలు దిశా నిర్దేశం చేస్తున్నారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మే 4న సీఎంగా మమతా బెనర్జీ ప్రమాణ స్వీకారం చేశారు. కానీ ఆమె నందిగ్రామ్ లో ఆమె సువేందు అధికారి చేతిలో పరాభవం చెందారు. దీంతో ఆమెకు కలిసొచ్చే భవానీపూర్ కాకుండా నందిగ్రామ్ వెళ్లడంతో పరాజయం పాలైనట్లు తెలుస్తోంది. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయడంతో ఈనెల 30న ఉప ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలో గత ఎన్నికల గుణపాఠంతో మమతా బెనర్జీ మళ్లీ భవానీపూర్ వైపు మొగ్గు చూపారు. దీంతో ఇక్కడ విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నారు. భవానీపూర్ లో ఎమ్మెల్యేను రాజీనామా చేయించడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. మమత ఎమ్మెల్యేగా విజయం సాధించకపోతే ఆమె సీఎం పీఠం నుంచి వైదొలగాల్సిందే. అందుకే ఆమెకు ఈ ఎన్నిక డూ ఆర్ డై గా మారనుంది. ఎలాగైనా విజయం సాధించేందుకు కసరత్తు చేస్తున్నారు.

భవానీపూర్ లో ఉప ఎన్నికపై ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గ్రామాల వారీగా బాధ్యులను నియమించుకుంటున్నారు. విజయం కంటే మెజార్టీ పై నే దృష్టి పెడుతున్నారు. అత్యధిక మెజార్టీ సాధించి పరువు నిలుపుకోవాలని భావిస్తున్నారు. దీంతో కార్యకర్తలపైనే పూర్తి బాధ్యతలు పెడుతున్నారు. ఎలాగైనా విజయం సాధించాలని కసరత్తు మొదలు పెడుతున్నారు. ఓటర్లను ప్రభావితం చేసే పనిలో పడిపోయారు.