Weather Report : ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. మరికొన్నిచోట్ల వర్షాలు కురుస్తున్న ఇంకొన్ని ప్రాంతాల్లో మాత్రం ఉష్ణోగ్రతతో ప్రజలు అల్లాడుతున్నారు. ఇలాంటి సమయంలో వర్షాకాలం ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రజలు నివసిస్తున్నారు. ఇలాంటి వారికి వాతావరణం శుభవార్త తెలిపింది. గతంలో కంటే ఈసారి ముందుగానే రుతుపవనాలు రానున్నాయి. అంతేకాకుండా ఈసారి దేశవ్యాప్తంగా వర్షాలు భారీగా కురిసే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే రుతుపవనాలు ఎప్పటినుంచి ప్రారంభమంటే?
Also Read : ఆ నాలుగు గంటలు.. ఏపీలో ఆ జిల్లాల ప్రజలకు హెచ్చరిక!
తాజాగా India meteorological department (IMD) తెలిపిన ప్రకారం ఈ నెల 27వ తేదీన నైరుతి రుతుపవనాలు కేరళను తాకనున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఈ తేదీ కంటే ముందే వచ్చే అవకాశం కూడా ఉన్నట్లు పేర్కొంటుంది. ఇలా జరిగితే చాలా సంవత్సరాల తర్వాత మళ్లీ ఇంత తొందరగా రుతుపవనాలు వస్తున్నాయి. గతంలో 2009 సంవత్సరంలో మే నెలలోనే రుతుపవనాలు ప్రారంభమయ్యాయి. ఆ ఏడాదిలో మే 23 నుంచి వర్షాలు కురిసినట్లు తెలుస్తోంది. సాధారణంగా మే నెల పూర్తయి జూన్ మొదటి వారంలో వర్షాలు ప్రారంభమవుతాయి. కానీ ఈసారి ముందుగానే నైరుతి రుతుపవనాలు ప్రవహించడం వల్ల జూన్ 8వ తేదీలోగా దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుస్తోంది.
ప్రస్తుతం వేసవికాలం కొనసాగుతున్నా.. హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసి అతలాకుతలమవుతున్నాయి. ముఖ్యంగా ఈ వర్షాలతో రైతులు తీవ్ర నష్టపోయారు. కొందరు ధాన్యం విక్రయించక ముందే వర్షాలు కురవడంతో తీవ్రంగా నష్టపోయారు. అయితే పంటను విక్రయించి కనీసం నెల తర్వాత రైతులు వర్క్షాల కోసం ఎదురుచూసేవారు. ఎందుకంటే వానకాలం పంట కోసం వర్షాలు ప్రారంభమైతే పంటలను సిద్ధం చేసుకునేవారు. కానీ ఇప్పుడు జూన్లోనే వర్షాలు ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రైతుల సైతం ముందుగానే పంటలను వేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
అయితే గత ఏడాది ప్రతి భారీ వర్షాలు కురిసి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఈసారి వర్షాల కంటే ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుందని అనుకున్నారు. కానీ వేసవికాలం మధ్యలోకి రాగానే అధికంగా ఉష్ణోగ్రత నమోదయి.. ఆ తరువాత అకాల వర్షాలు కురిసాయి. బలమైన గాలులు వీచి కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసాయి. కానీ మరికొన్ని చోట్ల మాత్రం ఎండ వేడి ఇంకా తగ్గడం లేదు. తెలంగాణలో జగిత్యాల, ఆసిఫాబాద్ వంటి జిల్లాల్లో ఉష్ణోగ్రత అధికంగా నమోదవుతూనే ఉంది.
Also Read : వేడెక్కుతున్న తెలుగు రాష్ట్రాలు.. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. ఎందుకిలా..!
అయితే వర్షాలు ఈ నెలలోనే ప్రారంభం అయ్యే అవకాశం ఉన్నందున రైతుల సైతం తమ పంటలను సిద్ధం చేసుకోవడానికి రెడీ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. అయితే ఈసారి భారీ వర్షాలు ఉంటాయా? లేక సాధారణ వర్షాలే ఉంటాయా? అనేది తెలియాల్సి ఉంది. గత ఏడాది సమృద్ధిగా వర్షాలు కురిసాయి. ఈ ఏడాది కూడా భారీగా వర్షాలు కురవాలని ముఖ్యంగా రైతుల కోరుతున్నారు.