ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో జల వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇద్దరు ముఖ్యమంత్రుల వైఖరితో రెండు ప్రాంతాలు వ్యతిరేకత భావంతో ఉంటున్నాయి. సమన్వయంతో పరిస్కరించుకోవాల్సిన సమస్యను జఠిలం చేసేందుకే పాలకులు ప్రాదాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీలో కొత్త గొడవకు తెర లేస్తోంది. రాజకీయంగా ఇబ్బందుల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ జల వివాదాన్ని మరో కోణంలోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. తెలంగాణతో జలవివాదాన్ని ఆసరాగా చేసుకుని రాయలసీమ ప్రకాశం జిల్లాల సమస్యగా మార్చాలనుకుని విపక్షం వైరుధ్యాలు పెంచేందుకు చొరవ చూపుతున్నట్లు తెలుస్తోంది.
పోతిరెడ్డిపాడు పథకంపై ఏపీ పట్టింపు ఎక్కువగా ఉండడంతో పొరుగు రాష్ర్టం విభేదిస్తోంది. దీనిపై న్యాయపోరాటానికి సైతం సిద్ధమవుతోంది. దీంట్లో మొదట లౌక్యంగా వ్యవహరించిన టీడీపీ తరువాత రాజకీయం చేయాలని భావిస్తోంది. వైసీపీని దెబ్బతీయాలనే ఉద్దేశంతో ప్రకాశం జిల్లా రైతులను సమిధలుగా ఉపయోగించుకుంటోంది. దీని వల్ల రాయలసీమలో సంబంధాలు దెబ్బతినే ప్రమాదం పొంచి ఉంది.
ఏ ఎండకు ఆ గొడుకు పట్టే పద్ధతికి రాజకీయ పార్టీలు స్వస్తి చెప్పాలి. దీర్ఘకాలిక ప్రయోజనాలు కావాలంటే కొన్ని స్వల్పకాలిక ప్రయోజనాలు వదులుకోవాలి. టీడీపీ గతంలో టీఆర్ఎస్ జట్టు కట్టడం, కాంగ్రెస్ తో కలవడం, నోటుకు ఓటు కేసులో తుడిచిపెట్టుకుపోవడం వంటి వాటితో తెలంగాణలో అదృశ్యమైపోయింది. అందుకే పాలకులు నిర్ణయాలు తీసుకునే క్రమంలో పద్ధతులు పాటించాలి. రేపటి కోడి కంటే ఇవ్వాళ్టి గుడ్డే నయం అనుకుంటే నష్టం జరిగే అవకాశాలుంటాయి. ఇప్పుడు ఏపీలో జరుగుతుంది అదే. వైసీపీని దెబ్బతీయాలని టీడీపీ చౌకబారు రాజకీయాలకు తెర తీస్తోందని చెబుతున్నారు.
సీఎంల వైఖరితో జల వివాదం కేంద్రం చేతిలోకి వెళితే రెండు ప్రాంతాలకు నష్టమే. ఒకసారి కేంద్రం పెత్తనం చేయడం మొదలుపెడితే అంతేసంగతి. ఈనేపథ్యంలో దక్షిణ తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లో అనేక ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. కాళేశ్వరం వంటి ప్రాజెక్టులు వేగంగా పూర్తవుతున్నాయి. దీన్ని ప్రతిపక్షాలు రాజకీయంగా వాడుకునే అవకాశాలున్నాయి. జగన్ పోతిరెడ్డిపాడుపై దృష్టి పెడితే సరిపోదు. పోలవరం వంటి బహుళార్ద సాధక ప్రాజె్టులు ఆలస్యం కాకుండా చూసుకోవాలి.