సద్దుమనుగుతున్న సరిహద్దు వివాదం!

గాల్వాన్ లోయ ఘటన తరువాత భారత్ చైనా దేశాల మద్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది.  ఇటీవలే ఇరు దేశాల మధ్య చర్చలు జరిగాయి.  ఈ చర్చల్లో కొంతమేర ఫలితం కనిపించింది.  చైనా మూడు కిలోమీటర్ల మేర వెనక్కి వెళ్ళగా, భారత్ బలగాలు 1.5 కిలోమీటర్ల మేర వెనక్కి వచ్చాయి.  అయితే, చైనాను నమ్మడానికి వీలు లేదని నిపుణులు అంటున్నారు.  జూన్ 6 వ తేదీన ఇరు దేశాల సైనికాధికారుల మధ్య చర్చలు జరిగినప్పటికీ, జూన్ 15 వ […]

Written By: Neelambaram, Updated On : July 9, 2020 9:52 pm
Follow us on

గాల్వాన్ లోయ ఘటన తరువాత భారత్ చైనా దేశాల మద్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది.  ఇటీవలే ఇరు దేశాల మధ్య చర్చలు జరిగాయి.  ఈ చర్చల్లో కొంతమేర ఫలితం కనిపించింది.  చైనా మూడు కిలోమీటర్ల మేర వెనక్కి వెళ్ళగా, భారత్ బలగాలు 1.5 కిలోమీటర్ల మేర వెనక్కి వచ్చాయి.  అయితే, చైనాను నమ్మడానికి వీలు లేదని నిపుణులు అంటున్నారు.  జూన్ 6 వ తేదీన ఇరు దేశాల సైనికాధికారుల మధ్య చర్చలు జరిగినప్పటికీ, జూన్ 15 వ తేదీన చైనా దొంగదెబ్బ కొట్టింది. అయితే వివాదాస్పద చైనా-భారత్ సరిహద్దులకు చెందిన పశ్చిమ సెక్టార్‌ లో పరిస్థితి మెరుగుపడుతోందని చైనా గురువారం ప్రకటించింది.

వాస్తవాధీన రేఖ వెంబడి గత కొన్ని దశాబ్దాలలో ఎన్నడూ లేని విధంగా రెండు దేశాలకు చెందిన సైనిక బలగాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్న దరిమిలా ఉభయ సేనలు వెనక్కు మరలిన నేపథ్యంలో చైనా ఈ ప్రకటన చేయడం గమనార్హం. చర్చల ప్రక్రియ కొనసాగింపులో భాగంగా భారత్-చైనా సరిహద్దు వ్యవహారాలపై ఏర్పడిన సంప్రదింపులు, సమన్వయ కార్యాచరణ యంత్రాంగం(డబ్లుఎంసిసి) ఆధ్వర్యంలో భారత్‌తో మరో విడత చర్చలు జరుపుతామని చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ వెల్లడించింది.

కమాండర్ స్థాయి చర్చలలో కుదిరిన ఏకాభిప్రాయం మేరకు లడఖ్‌లోని గల్వాన్ లోయ, ఇతర ఎల్‌ఎసి ప్రాంతాల నుంచి భారత్-చైనా సేనల ఉపసంహరణకు పటిష్టమైన చర్యలు చేపట్టినట్లు విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి జో లిజియన్ గురువారం విలేకరుల సమావేశంలో తెలిపారు. సరిహద్దుల వెంబడి పరిస్థితి నిలకడగా, మెరుగుపడుతూ ఉందని ఆయన చెప్పారు. డబ్యుఎంసిసి సమావేశాలతో సహా సైనిక, దౌత్యపరమైన విధానాల ద్వారా ఉభయ పక్షాల మధ్య చర్చలు, సమాచార మార్పిడి కొనసాగుతుందని ఆయన తెలిపారు. అయితే, చైనా బలగాలు, ఆయుధ సామగ్రి ఉపసంహరణ విధివిధానాలను ఆయన వివరించలేదు. కాగా, సరిహద్దుల వద్ద ఉద్రిక్తతలను తగ్గించడానికి రెండు దేశాల మధ్య కుదిరిన ఏకాభిప్రాయాన్ని అమలు చేయడంలో భారత్ తమతో కలసి పనిచేయగలదని ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.