మూడు రాజధానులను చేస్తాం, అన్ని వర్గాలను న్యాయం చేస్తామని ముఖ్యమంత్రి జగన్ చెప్పారు. ఆ మేరకు చట్టాన్ని చేశారు. అయితే.. అది న్యాయస్థానంలో ఉంది. ఇంతలోనే జనం తీర్పు వచ్చేసింది. విశాఖ రాజధానిగా ప్రజలు ఒప్పుకోవడంలేదని ఇప్పటిదాకా మాట్లాడిన తెలుగుదేశం అధినాయకులకు దిమ్మతిరిగే తీర్పుని విశాఖ జనం ఇచ్చారు.
Also Read: మున్సి‘పోరులో’ కనిపించని బీజేపీ అడ్రస్.. పొత్తుపై జనసేనాని దీర్ఘాలోచన
మున్సిపల్ ఎన్నికల్లో మూడు ప్రాంతాల్లోనూ వైఎస్సార్ సీపీ ప్రభుత్వానికి దక్కిన అపూర్వ ఆదరణే ఇందుకు నిదర్శనం. రాష్ట్రమంతా మాదిరిగానే రాజధాని ప్రాంతాలు మూడింటా ఘన విజయాన్ని అందించి ముఖ్యమంత్రి జగన్ సంక్షేమ పాలనను, అభివృద్ధి నిర్ణయాలను ప్రజలు స్వాగతించారు. గుంటూరు – విజయవాడ కావచ్చు. విశాఖ కావచ్చు.. కర్నూలు కావచ్చు… మూడు రాజధానులుగా ప్రకటించిన పెద్ద కార్పొరేషన్లలో భారీ విజయాన్ని చేకూర్చారు. చంద్రబాబు ప్రత్యేకంగా దృష్టి పెట్టి రెచ్చగొట్టేలా ప్రచారం నిర్వహించినా ఆయన మాటలను ప్రజలు నమ్మలేదు. పాలన వికేంద్రీకరణకు జై కొట్టారు.
పాలన వికేంద్రీకరణ ద్వారా అన్ని ప్రాంతాలకు అభివృద్ధిని సమానంగా విస్తరించాలనే వైఎస్సార్ సీపీ ప్రభుత్వ నిర్ణయానికి ప్రజల నుంచి సంపూర్ణ మద్దతు లభించింది. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలిచ్చిన విస్పష్టమైన తీర్పు దీన్ని తేటతెల్లం చేసింది. ప్రధానంగా అర్బన్ ప్రాంతాల్లో వైఎస్సార్‌సీపీ సాధించిన అద్భుత విజయం వికేంద్రీకరణకు అడ్డుపడుతున్న స్వార్థ రాజకీయ పక్షాలకు చెంపపెట్టని రుజువైంది. పట్టణ ప్రాంత ప్రజలు వికేంద్రీకరణకు వ్యతిరేకమనే వాదన తప్పని ఈ ఫలితాలు తేల్చేశాయి. విద్యావంతులు అధికంగా ఉండే మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలో మూడు రాజధానుల నిర్ణయాన్ని అంగీకరించడం లేదనే ప్రచారం అంతా భ్రమేనని స్పష్టమైంది. విజయనగరం మొదలు శ్రీకాకుళం, విశాఖ.. అమరావతి, కర్నూలు, తిరుపతి.. ప్రతిచోటా వైఎస్సార్‌సీపీకి పట్టం కట్టిన ప్రజలు వికేంద్రీకరణకే తాము మద్దతు ఇస్తున్నట్లు స్పష్టం చేశారు.
రాష్ట్రంలోని మూడు ప్రాంతాలను అభివృద్ధి చేసే లక్ష్యంతో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మూడు రాజధానులను ప్రకటించిన విషయం తెలిసిందే. విశాఖలో పరిపాలనా రాజధాని, అమరావతిలో శాసన రాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేయడం ద్వారా మూడు ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అమరావతి పేరుతో కృత్రిమ ఉద్యమాన్ని సృష్టించి వికేంద్రీకరణ ప్రయత్నాలను అడ్డుకునేందుకు సర్వశక్తులు ఒడ్డారు. రాజధాని నిర్మాణం ముసుగులో చేసిన అరాచకాలను కప్పిపుచ్చుతూ కొందరు స్వార్థపరులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులను ఉసిగొల్పి ప్రభుత్వంపై దుష్ప్రచారమే లక్ష్యంగా పెట్టుకున్నారు. 29 గ్రామాలకు చెందిన కొందరు వ్యక్తులు, బయట ప్రాంతాల నుంచి తరలించిన వారితో దీక్షలు, ఉద్యమాలు చేయించి హంగామా సృష్టించారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహించి రిఫరెండం కోరాలని చంద్రబాబు, ఆయన్ను వెన్నంటి ఉండే జనసేన, సీపీఐ పార్టీలు అధికార పక్షాన్ని సవాల్ చేయని రోజే లేదు.
Also Read: స్థానిక సమస్యలే ఎజెండాగా ఓట్లు..!.. వైసీపీ క్లీన్ స్వీప్
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు తన స్థాయిని మరచిపోయి అమరావతి పేరుతో ప్రజల్ని రెచ్చగొట్టాలని ప్రయత్నించారు. గుంటూరు వాసులకు రోషం లేదని, సిగ్గుంటే వైఎస్సార్‌సీపీకి ఓటేయరని తిట్టిపోశారు. గుంటూరు కార్పొరేషన్‌లో వైఎస్సార్‌సీపీ గెలిస్తే అక్కడి ప్రజలు అమరావతి వద్దని చెప్పినట్లేనని వ్యాఖ్యలు చేశారు. పోలింగ్‌కు ముందురోజు అమరావతి ఉద్యమం పేరుతో కొందరు మహిళలను విజయవాడకు పంపి అలజడి సృష్టించాలని చూశారు. వారిని పోలీసులు అడ్డుకునేలా చేసి సానుభూతి పొందాలని ప్రయత్నించారు. ఇవన్నీ మున్సిపల్ ఎన్నికల్లో వికటించాయి. ఎక్కడైతే చంద్రబాబు తిట్టారో అక్కడ ప్రజలు టీడీపీని చిత్తుచిత్తుగా ఓడించారు. గుంటూరు, విజయవాడ కార్పొరేషన్లలో టీడీపీ ఘోరంగా ఓటమిపాలైంది. ఈ రెండు కార్పొరేషన్లలో అధికార పార్టీ గెలిస్తే రాజధాని తరలిపోతుందని టీడీపీ నాయకులు రెచ్చగొట్టినా ప్రజలు విజ్ఞతతో వ్యవహరించి వైఎస్సార్‌సీపీకి పట్టంగట్టారు.
అమరావతి ప్రభావం ఉంటుందని టీడీపీ చెప్పుకునే కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఆ పార్టీ మట్టికరిచింది. రెండు జిల్లాల్లో ఎన్నికలు జరిగిన కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో ఎక్కడా ఆ పార్టీ గెలవకపోగా అవమానకరమైన రీతిలో సింగిల్ డిజిట్ వార్డులు, డివిజన్లకే పరిమితమైంది. పరిపాలనా రాజధానిగా ప్రకటించిన విశాఖలో ప్రజలు టీడీపీని తిరస్కరించారు. న్యాయ రాజధానిగా ప్రకటించిన కర్నూలులో వైఎస్సార్‌సీపీకి పట్టం కట్టారు. ప్రాంతాలకు అతీతంగా అన్ని చోట్లా వైఎస్సార్‌సీపీని గెలిపించడం ద్వారా అమరావతి పేరుతో చంద్రబాబు చేస్తున్నది ఫేక్ ప్రచారమని తేల్చేశారు. పంచాయతీ ఎన్నికల్లోనూ అమరావతి ప్రాంతం ఉన్న తాడికొండ సహా అన్ని నియోజకవర్గాల్లోనూ వైఎస్సార్‌సీపీని ఆదరించడం ద్వారా వికేంద్రీకరణకు ప్రజలు మద్దతు పలికారు. గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణాల్లోనూ వికేంద్రీకరణకు ప్రజలు జై కొట్టినట్లు స్పష్టమైంది.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Read MoreWeb Title: Voters support ap three capitals
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com