
Pawan Kalyan: మచిలీపట్నంలో జరిగిన జనసేన ఆవిర్భావ సభలో పవన్ కల్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక అబద్దానికి ఓటు వేసి చాలా నష్టపోతున్నారని విమర్శలు గుప్పించారు. ఆయన మాటలు విని మహిళలే కాకుండా యువత కూడా పెడదోవ పెట్టిందని మండిపడ్డారు.
మద్యపాన నిషేధం సాధ్యం కాదని తెలిసినా..
వైసీపీ ప్రభుత్వం ఎన్నికల హామీల్లో భాగంగా మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చి తుంగలో తొక్కారని అన్నారు. సాధ్యం కాదని తెలిసినా కూడా అబద్దపు హామీలిచ్చి అందలెమెక్కారని చెప్పారు. ఆయన మాటలు నమ్మిన మహిళలు మరింత బాధ పెడుతున్నారని వివరించారు. అన్నా హాజరే లాంటి వ్యక్తి సంపూర్ణ మద్యపాన నిషేధం చేసి చూపించారని, అలాంటి వాతావరణం ఇక్కడ కల్పించడంలో ముఖ్యంమతి జగన్ ఫెయిలయ్యారని అన్నారు. లివర్ కు హాని కలిగించని మద్యాన్ని ఉత్పత్తి చేయాలని తాము సూచిస్తే కల్తీ మద్యం అమ్ముతూ ప్రజల ప్రాణాలతో చెలగామటమాడుతున్నారని విమర్శించారు.
గంజాయంధ్రప్రదేశ్‌గా మార్చేశారు
రాష్ట్రాన్ని గంజాయంధ్ర ప్రదేశ్‌గా మారిపోయిందని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో గంజాయి పట్టుపడితే అందులో సగభాగం ఆంధ్రకే చెందినదై ఉంటుందని అన్నారు. యువత గంజాయి మత్తులో తూగుతోందని చెప్పుకొచ్చారు. గంజాయి మత్తులో మర్డర్లు, మానభంగాలు చేస్తున్నారని అన్నారు. ఇటువంటి సమాజమా కోరుకున్నది అని ప్రశ్నించారు.
మార్పు రావాలి
ఇప్పటికైనా మార్పు రావాలని పవన్ కల్యాణ్ తన అభిమతాన్ని వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో అబద్దపు పార్టీకి ఓటు వేశారని, రాబోవు ప్రభుత్వం ఎలా ఉండాలో నిర్ణయించుకోవాలని సూచించారు. విశాల మనస్తత్వంతో ఆలోచించి రాబోవు ఎన్నికల్లో జనసేనకు మద్దతుగా నిలవాలని కోరారు. అవసరమైతే ఒంటరిగా వెళ్లేందుకు కూడా సిద్ధపడతానని అన్నారు. త్వరలో ప్రజల్లోకి రాబోతున్నట్లు తెలిపారు.