https://oktelugu.com/

చైతూ ‘లవ్ స్టోరీ’పై పిడుగు.. శేఖర్ కమ్ములకు చిక్కులు

ఫీల్ గుడ్ సినిమాలతో ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్న శేఖర్ కమ్ముల తాజాగా తీస్తున్న మూవీ ‘లవ్ స్టోరీ’. నాగచైతన్య-సాయిపల్లవి జంటగా తీస్తున్న ఈ మూవీపై ఇప్పటికే బోలెడు క్రేజ్ ఉంది. ‘సారంగ దరియా’ పాటతో ఈ సినిమాకు ఫుల్ హైప్ వచ్చింది. అయితే దాదాపు అన్ని పూర్తి చేసుకున్న ‘లవ్ స్టోరీ’ మూవీ ఇప్పుడు ఏప్రిల్ 16న విడుదలకు రెడీ అవుతోంది. ఇప్పటికే సెన్సార్ సహా అన్ని పూర్తి ట్రైలర్ రిలీజ్ కు రెడీ చేయగా ఆ […]

Written By:
  • NARESH
  • , Updated On : April 7, 2021 / 01:45 PM IST
    Follow us on

    ఫీల్ గుడ్ సినిమాలతో ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్న శేఖర్ కమ్ముల తాజాగా తీస్తున్న మూవీ ‘లవ్ స్టోరీ’. నాగచైతన్య-సాయిపల్లవి జంటగా తీస్తున్న ఈ మూవీపై ఇప్పటికే బోలెడు క్రేజ్ ఉంది. ‘సారంగ దరియా’ పాటతో ఈ సినిమాకు ఫుల్ హైప్ వచ్చింది.

    అయితే దాదాపు అన్ని పూర్తి చేసుకున్న ‘లవ్ స్టోరీ’ మూవీ ఇప్పుడు ఏప్రిల్ 16న విడుదలకు రెడీ అవుతోంది. ఇప్పటికే సెన్సార్ సహా అన్ని పూర్తి ట్రైలర్ రిలీజ్ కు రెడీ చేయగా ఆ సినిమాపై కరోనా పిడుగు పడింది. సినిమా విడుదల సందిగ్ధంలో పడింది.

    దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ దృష్ట్యా అటు కేంద్రప్రభుత్వం, ఇటు తెలుగు రాష్ట్రాలు ఏప్రిల్ 15 నుంచి థియేటర్లు, బార్లు, వైన్స్ లపై నిబంధనలు పెడుతారని వార్తలు వస్తున్నాయి. 50శాతం అక్యుపెన్సీతోనే సినిమాలు ఆడేలా నిబంధన అమల్లోకి రావచ్చని అంటున్నారు.

    దీంతో సినిమాల విడుదల ఆగిపోనుంది. 50శఆతం ఆక్యూపెన్సీతో  సినిమాలు విడుదల చేస్తే కలెక్షన్లపై తీవ్ర ప్రభావం పడుతుంది. దానికన్నా కరోనా తగ్గాక విడుదల చేయడమే మేలు అని మేకర్స్ భావిస్తున్నారు. కరోనా తీవ్రం కావడంతో పెద్ద హీరోల సినిమాలకు తప్పితే చిన్న హీరోలైన నాగచైతన్య మూవీకి జనాలు వచ్చే పరిస్థితి ఉండదు.

    అందుకే ప్రస్తుతం ఏప్రిల్ 16న రిలీజ్ కానున్న ‘లవ్ స్టోరీ’ సినిమా విడుదలను వాయిదా వేయాలని యోచిస్తున్నారట..