Vizag Steel Plant Issue: ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలో ప్రస్తుతం రెండు ఉద్యమాలు జోరుగా సాగుతున్నాయి. ఇందులో 600 వందల రోజులుగా అమరావతి రాజధాని రైతుల ఉద్యమం కొనసాగుతుండగా విశాఖ ఉక్కు ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు 200 రోజులుగా ఉద్యమిస్తున్నారు. రెండు ఉద్యమాల్లో కూడా ప్రజలు, కార్మికులు తమ మొర పెట్టుకుంటున్నారు. తమ ఆశయ సాధనకు విశ్రమించేది లేదని చెబుతున్నారు. వీటిపై అప్పుడప్పుడు రాజకీయ పార్టీలు ప్రకటనలు చేస్తున్నా వారి వెన్నంటి ఉండి పోరాటంలో మాత్రం పాల్గొనడం లేదు. దీంతో ప్రజల్లో ఆగ్రహం పెరుగుతోంది. ఎన్నికలప్పుడే గుర్తుకు వచ్చే నాయకులకు ప్రజాసమస్యలు పట్టవని తెలుస్తోంది. అందుకే వారు పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి.
విశాఖ స్టీల్ ప్లాంట్ ను అమ్మాలని కేంద్రం నిర్ణయించడంతో కార్మికుల్లో ఆందోళన పెరిగింది. రెండు వందల రోజులుగా ఉద్యోగులు రోడ్డెక్కారు. తమ సంస్థను కాపాడుకునేందుకు ఎన్ని పోరాటాలైనా చేస్తామని చెబుతున్నారు. సమస్యను పరిష్కరించే క్రమంలో కార్మికులు తమ ఊపిరి ఉన్నంత వరకు పోరాడతామని పేర్కొంటున్నారు. పరిశ్రమను ప్రైవేటీకరిస్తే ఊరుకునేది లేదని చెబుతున్నారు.
స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల సమస్యలు ఎవరు పట్టించుకోవడం లేదు. కార్పొరేషన్ ఎన్నికల వరకు పట్టించుకున్నా తరువాత మానేశాయి. దీంతో కేంద్రం శరవేగంగా తన చర్యలు ముందుకు తీసుకెళ్తోంది. ప్లాంట్ ప్రైవేటీకరణ జరిగితే కార్మికుల హక్కులు హరిస్తాయని భయపడుతున్నారు. రోజు దీక్షలు చేపడుతున్నారు. ఇటీవల మానవహారం నిర్వహించి తమలోని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మద్దతు తెలపడానికి వచ్చిన నేతలను తీవ్ర స్థాయిలో దూషించి అక్కడి నుంచి పంపించేశారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ పై న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నారు. ఎంతటి త్యాగానికైనా వెనుకడాకుండా తమ సంస్థను కాపాడుకోవడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. కార్మికుల మనుగడ కోసం అందరు ఏకతాటిపైకి వచ్చి పోరాటం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారం ఎప్పటికి తేలేనో అని ఎదురు చూస్తున్నారు. ప్లాంట్ పరిరక్షణకు ఉద్యమం చేస్తామని చెబుతున్నారు.
అమరావతి ఉద్యమం కూడా ఆరువందల రోజులు పూర్తి కావడంతో ఇప్పటికి రైతులు తమ న్యాయమైన డిమాండ్ నెరవేర్చాలని రాజకీయ పార్టీలను కోరుతున్నా పట్టించుకోవడం లేదు. ఫలితంగా అమరావతి రాజధానిగా ఒప్పుకోవాలని కోరుతున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. దీంతో విశాఖ ప్లాంట్, అమరావతి సమస్యల పరిష్కారంలో ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని తెలుస్తోంది.