Homeఎంటర్టైన్మెంట్Celebrities Wishes to Nag: నాగ్ కి ఎవరు ఏ విధంగా ...

Celebrities Wishes to Nag: నాగ్ కి ఎవరు ఏ విధంగా విషెస్ చెప్పారంటే.. !

Celebrities Wishes to Nagarjuna

Celebrities Wishes to Nag:  కింగ్ నాగార్జున ఈ రోజు తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. తమ అభిమాన కథానాయకుడికి శుభాకాంక్షలు తెలియజేయడానికి అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా పోటీ పడ్డారు. మరి సినీ ప్రముఖుల్లో.. ఎవరు ఏ విధంగా, నాగ్ కి బర్త్‌ డే విషెస్ చెప్పారో చూద్దాం.

‘నా హృదయానికి దగ్గరమైన ప్రియమైన స్నేహితుడు నాగార్జునకు జన్మదిన శుభాకాంక్షలు. జీవితంలోని ప్రతిక్షణాన్ని ఆస్వాదించగలిగే వ్యక్తివి నువ్వు. ఒక నటుడిగా ప్రతిసారీ ప్రయోగాలు చేస్తూ.. నీ పరిధిని విస్తృతం చేసుకుంటున్నావు. నువ్వు ఎప్పుడూ ఇలాగే సంతోషంగా జీవించాలని కోరుకుంటున్నాను’ – మెగాస్టార్ చిరంజీవి

‘గొప్ప వ్యక్తి, అద్భుతమైన మా నాగ్‌ మామకు ప్రత్యేక పుట్టినరోజు శుభాకాంక్షలు. మీ పై నాకున్న ప్రేమను, అభిమానాన్ని పదాల్లో మాటల్లో చెప్పలేను, మీరు ఎల్లప్పుడు ఆరోగ్యంతో ఫుల్ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను” – అక్కినేని సమంత

‘నా ప్రేమకు నా జీవితానికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయురారోగ్యాలు, ఆనందం, మరెన్నో విజయాలు మీ సొంతం కావాలి. డియర్‌ నాగ్‌.. నేను మీ జీవిత భాగస్వామిని అవ్వడం నా అదృష్టం. అందుకు నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ఇక మా వారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్న ప్రతిఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు. మీరందరూ ఆరోగ్యంగా, సురక్షితంగా జీవించండి ’ అక్కినేని అమల

‘ఎన్నో సంవత్సరాల నుంచి అన్ని రకాల జోనర్లలో ప్రతిసారీ ప్రయోగాలు చేస్తూ కొత్త రకం సినిమాలతో ఎప్పటికపుడు ప్రేక్షకుల్ని అలరిస్తున్న కింగ్‌ నాగార్జన గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ ఏడాది మొత్తం మీకు మరింత సూపర్‌ గా సాగాలని కోరుకుంటున్నాను’ – క్రియేటివ్ దర్శకుడు క్రిష్‌

‘ఎవర్‌ గ్రీన్‌ ట్రెండ్‌ సెట్టర్‌ కింగ్‌ నాగార్జునకు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు మంచి వ్యక్తి, నటుడిగా ఎంతోమందిలో స్ఫూర్తి నింపారు. మీరు ఆరోగ్యంగా జీవించాలి’ – మంచు లక్ష్మి

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Exit mobile version