దారుణమైన స్థితిలో మత్తు డాక్టర్ సుధాకర్ రావు..!

కరోనాను ఎదుర్కొనేందుకు వైద్యులకు మాస్కులు ఇవ్వడం లేదని ప్రభుత్వంపై విమర్శలు చేసిన మత్తు వైద్యుడు సుధాకర్ రావు దారుణమైన స్థితిలో విశాఖ రోడ్లపై కనిపించాడు. అర్ధనగ్నంగా, గుండుతో దర్శనమిచ్చాడు. విశాఖ నగర వీధుల్లో డా.సుధాకర్ ను తాళ్లతో కట్టేసి పోలీసులు లాఠీలతో దారుణంగా కొట్టిన సంఘటన ఈ రోజు చోటు చేసుకుంది. తాటిచెట్లపాలెం పోర్టు ఆస్పత్రి వద్ద ఈ ఘటన చూసినవారికి హృదయ విధారకంగా సుధాకర్ కనిపించారు. అనంతరం ఆటోలో 4వ టౌన్ పోలీసు స్టేషన్ కు […]

Written By: Neelambaram, Updated On : May 16, 2020 8:16 pm
Follow us on

కరోనాను ఎదుర్కొనేందుకు వైద్యులకు మాస్కులు ఇవ్వడం లేదని ప్రభుత్వంపై విమర్శలు చేసిన మత్తు వైద్యుడు సుధాకర్ రావు దారుణమైన స్థితిలో విశాఖ రోడ్లపై కనిపించాడు. అర్ధనగ్నంగా, గుండుతో దర్శనమిచ్చాడు. విశాఖ నగర వీధుల్లో డా.సుధాకర్ ను తాళ్లతో కట్టేసి పోలీసులు లాఠీలతో దారుణంగా కొట్టిన సంఘటన ఈ రోజు చోటు చేసుకుంది. తాటిచెట్లపాలెం పోర్టు ఆస్పత్రి వద్ద ఈ ఘటన చూసినవారికి హృదయ విధారకంగా సుధాకర్ కనిపించారు. అనంతరం ఆటోలో 4వ టౌన్ పోలీసు స్టేషన్ కు పోలీసులు తరలించారు. ఏపీ ప్రభుత్వం పై మాస్కుల విషయంలో ఇటీవల ఆరోపణలు చేసిన డా.సుధాకర్ ను సస్పెండ్ చేసిన విషయం విధితమే. ఆస్పత్రిలో మాస్కులు లేవని డాక్టర్లకు సదుపాయాలు లేవని విమర్శించారు. పోలీసులు ఇంత దారుణంగా ఎందుకు వ్యవహరించారనే విషయం వెల్లడించలేదు. సంఘటనకు సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది.