Pawan Kalyan: వైజాగ్ హోటల్ నోవొటెల్ వద్ద ఉద్రిక్తత వాతావరణం..వేలాదిగా తరలి వస్తున్న పవన్ కళ్యాణ్ ఫాన్స్

Pawan Kalyan Vizag Tour: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర లో మూడు రోజులు పర్యటన నిమ్మితం నిన్న వైజాగ్ కి చేరుకున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఆయన వైజాగ్ కి వచ్చిన తర్వాత ప్రభుత్వం ఎలాంటి అలజడి సృష్టిస్తూ ముందుకు పోతుందో మనం చూస్తూనే ఉన్నాము..వైసీపీ నాయకులను జనసేన కార్యకర్తలు కొట్టారని..పవన్ కళ్యాణ్ ర్యాలీ వల్ల సామాన్య జనాలు చాలా ఇబ్బందికి గురైయ్యారని..నిన్న గర్జనకు వచ్చిన మంత్రులు సైతం పవన్ కళ్యాణ్ ర్యాలీ […]

Written By: NARESH, Updated On : October 16, 2022 6:25 pm
Follow us on

Pawan Kalyan Vizag Tour: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర లో మూడు రోజులు పర్యటన నిమ్మితం నిన్న వైజాగ్ కి చేరుకున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఆయన వైజాగ్ కి వచ్చిన తర్వాత ప్రభుత్వం ఎలాంటి అలజడి సృష్టిస్తూ ముందుకు పోతుందో మనం చూస్తూనే ఉన్నాము..వైసీపీ నాయకులను జనసేన కార్యకర్తలు కొట్టారని..పవన్ కళ్యాణ్ ర్యాలీ వల్ల సామాన్య జనాలు చాలా ఇబ్బందికి గురైయ్యారని..నిన్న గర్జనకు వచ్చిన మంత్రులు సైతం పవన్ కళ్యాణ్ ర్యాలీ వల్ల ట్రాఫిక్ జామ్ లో చిక్కుకొని ఫ్లైట్లు మిస్ అయ్యారని..మంత్రులకే ఇలా ఉంటె ఇక సామాన్యులకు ఎలా ఉంటుంది.

ఇది కచ్చితంగా శాంతి భద్రతలకు విఘాతం కళించే కార్యక్రమాలు అంటూ పవన్ కళ్యాణ్ మీద లేని పోనీ ఆరోపణలు చేసి, అర్థ రాత్రి వంద మంది జనసేన నాయకులను అరెస్ట్ చేసి..ఇలా ఎన్నో రకాలుగా పవన్ కళ్యాణ్ ఈరోజు చేపట్టాల్సిన జనవాణి కార్యక్రమాన్ని ఆపి వెంటనే వైజాగ్ వదిలి వెళ్లిపోవాలంటూ ఆయనకీ 41A నోటీసులు జారీ చేసాడు..ఈ నోటీసు ని పవన్ కళ్యాణ్ మీడియా ముందు తీసుకుంటూ అందులోనే విషయాన్నీ చదివి పోలీసులను ప్రశ్నించగా, పోలీసులు బిక్కమొహం వేసిన వీడియోలు సోషల్ మీడియా లో తెగ ట్రెండ్ అవుతుంది.

https://twitter.com/mnadendla/status/1581604239976980480?s=20&t=Zemef17RCBwaFpU2SPmrlw

నోటీసు ప్రకారం పవన్ కళ్యాణ్ ఎలాంటి మీటింగ్స్ అక్టోబర్ 31 వరుకు పెట్టకూడదు కాబట్టి..ఆయన వైజాగ్ లో ప్రస్తుతం నివాసం ఉంటున్న నోవొటెల్ హోటల్ రూమ్ నుండి అభిమానులకు అభివాదం చేస్తూ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వీడియో అప్లోడ్ చేసాడు..’ఆంధ్ర ప్రదేశ్ పోలీసులు నన్ను మీటింగ్స్ పెట్టనివ్వకుండా చేస్తున్నారు..ఇప్పుడు నేను హోటల్ రూమ్ నుండి అభిమానులకు అభివాదం చేస్తున్నాను..కనీసం దీనికి అయినా అడ్డు చెప్పారు అని ఆశిస్తున్నాను’ అంటూ వ్యంగ్యంగా పవన్ కళ్యాణ్ వేసిన ఒక ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారిపోయింది..పవన్ కళ్యాణ్ హోటల్ రూమ్ నుండే అభిమానులకు అభివాదం చేస్తున్నాడు అని తెలుసుకున్న ఫాన్స్..వెంటనే వేల సంఖ్యలో బీచ్ రోడ్ కి చేరుకున్నారు..అక్కడ ఉన్న వాతవరణం ని పోలీసులు కూడా అదుపు చెయ్యలేకున్నారు.

https://twitter.com/JANASENAVAMSI3/status/1581604568911126530?s=20&t=J3KDM15D_9r-g9og7Suglw

సమయం పెరిగే కొద్దీ పవన్ కళ్యాణ్ కి మద్దత్తు గా అక్కడ అభిమానులు పెరుగుతూ పోవడం తో అరెస్టు చేసిన జనసేన నాయకులను విడిచిపెట్టాలా వద్దా అనే సందిగ్ధం లో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది..ఈ వివాదం ఎన్ని రోజులు కొనసాగుతుందో తెలీదు కానీ..అరెస్ట్ చేసిన జనసేన నాయకులను వదిలిపెట్టేదాకా పవన్ కళ్యాణ్ వైజాగ్ వదిలి వెళ్లే సమస్యే లేదని మాత్రం అర్థం అవుతుంది.