రాజకీయాలకు బలైన డాక్టర్ సుధాకర్ రావు..!

వివిధ పార్టీల రాజకీయాలకు మత్తు వైద్యుడు సుధాకర్ రావు ఒక పావుగా మారాడు. రాష్ట్రంలో వైద్యుడు సుధాకర్ రావు వ్యవహారం చర్చ నీయాంశంగా మారింది. నర్సీపట్నంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహించే సమయంలో సుధాకర్ రావు గురించి ఆసుపత్రిలో సిబ్బందికి, ఆయన నివాసం ఉండే ప్రాంతంలో కొందరికి తప్ప ఇతరులు ఎవరికి తెలియదు. ఏప్రిల్ 6వ తేదీన నర్సీపట్నంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆయన మాస్క్ లు ఇవ్వడం లేదంటూ ప్రభుత్వంపై మీడియా వద్ద విమర్శలు […]

Written By: Neelambaram, Updated On : May 17, 2020 5:20 pm
Follow us on


వివిధ పార్టీల రాజకీయాలకు మత్తు వైద్యుడు సుధాకర్ రావు ఒక పావుగా మారాడు. రాష్ట్రంలో వైద్యుడు సుధాకర్ రావు వ్యవహారం చర్చ నీయాంశంగా మారింది. నర్సీపట్నంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహించే సమయంలో సుధాకర్ రావు గురించి ఆసుపత్రిలో సిబ్బందికి, ఆయన నివాసం ఉండే ప్రాంతంలో కొందరికి తప్ప ఇతరులు ఎవరికి తెలియదు. ఏప్రిల్ 6వ తేదీన నర్సీపట్నంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆయన మాస్క్ లు ఇవ్వడం లేదంటూ ప్రభుత్వంపై మీడియా వద్ద విమర్శలు చేశారు. అప్పటికే ఆసుపత్రుల్లో మాస్క్ లు, పిపిఈ కిట్లు లేవంటూ ప్రభుత్వాన్ని ఎండగట్టే పనిలో ఉన్న టీడీపీ ఈ విషయాన్ని టీడీపీ తమ వాదనలకు బలం చేకూర్చుకునేందుకు వాడుకుంది. వైద్యుడు సుధాకర్ రావు మాట్లాడిన వీడియోను సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేసింది.

దీంతో అధికార పక్షం సుధాకర్ రావుకు టీడీపీ ముద్ర వేసింది. ఏప్రిల్ 7వ తేదీన సర్సీపటం ఎమ్మెల్యే పి.ఉమా శంకర గణేష్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి సుధాకర్ రావు ఆసుపత్రికి వచ్చే ముందు మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు నివాసానికి వెళ్లాడని చెప్పారు. అక్కడి నుంచి ప్రభుత్వ ఆదేశాల మేరకు కలెక్టర్ నివేదిక కోరడం సుధాకర్ రావుపై క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు సస్పెన్షన్ వేటు వేయడం జరిగి పోయింది.

సస్పెన్షన్ లో ఉన్న సుధాకర్ రావు మానసికంగా ఆందోళనకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. 40 రోజుల అనంతరం సుధాకర్ రావు కనిపించిన పరిస్థితి ఆందోళన కలిగించేదిగా ఉంది. అతను మద్యం మత్తులో ఉండటం ఒక అంశమైతే, పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్న విధానం బాధాకరంగా ఉంది. మండు వేసవిలో అర్ధనగ్నంగా చేతులు కట్టేసి నడి రోడ్డుపై పడుకోపెట్టిన విధానం చేస్తే ఆయన కుటుంబ సభ్యులకు గుండె కోతే. చివరికి మానసిక స్థితి సరిగా లేదని ప్రభుత్వ మానసిక వైద్యశాల సూపరింటెండెంట్ రాధ రాణి వెల్లడించారు. టిడిపి, సీపీఐ సుధాకర్ రావు వ్యవహారంపై సమగ్ర విచారణకు డిమాండ్ చేస్తున్నారు. దళిత సంఘాలు ప్రభుత్వ తీరును తప్పు బడుతున్నాయి. ఏదిఏమైనా రాష్ట్ర రాజకీయలకు సుధాకర్ రావు బలి అయ్యాడనేది వాస్తవం.