Airlence : టిఫిన్ దుబాయ్ లో.. లంచ్ సింగపూర్ లో.. డిన్నర్ అమెరికాలో చేసే పారిశ్రామికవేత్తలు ఉన్న ఈరోజుల్లో అందరినీ గమ్మున ఇంట్లో కూర్చుండబెట్టిన ఘనత కరోనాదే. అంతటి మహమ్మారి ధాటికి అన్నీ మూతపడి అందరూ ఇంట్లోనే బంధీ అయిపోయారు. కరోనా కాటేసిన ముఖ్య రంగాల్లో విమానయానం ఒకటి. అన్నింటికంటే చావు దెబ్బపడిందే ఈ రంగంపైనే. అది కోలుకోవడానికి ఇంకా సమయం పడుతోంది. అయితే విమానయాన రంగంలో ఉన్న విస్తారా ఎయిర్ లైన్స్ తాజాగా ప్రయాణికులకు రాసిన లేఖ చూస్తే విమానయాన రంగం ఎంతో కష్టాల్లో ఉందో అర్థమైంది. ఆ లేఖ ఇప్పుడు సంచలనమైంది.

విమాన ప్రయాణికుల అంచనాలను అందుకోలేక విస్తారా ఎయిర్ లైన్స్ సీఈవో మథనపడుతూ రాసిన లేఖ వైరల్ అయ్యింది. కస్టమర్ల అంచనాలను గత కొన్ని నెలలుగా అందుకోలేకపోతున్నట్టు విస్తారా సీఈవో వినోద్ కన్నన్ ఆవేదన చెందారు. అంతరాలను పూడ్చేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ఈ మేరకు కస్టమర్లకు ఆయన రాసిన లేఖ వైరల్ అయ్యింది.
విమాన ప్రయాణం ఒక లావీదేవి కాకుండా.. సంతోషకరమైన ఒక మరుపురాని అనుభూతిగా మిగల్చాలని కోరుకుంటున్నామని.. కొన్ని నెలలుగా మేము అంచనాలను అందుకోలేని విషయం నిజమేనంటూ ఆయన వాపోయారు. ప్రయాణికుల సమస్యలకు వెబ్ సైట్ కానీ.. యాప్ కానీ నిర్ధేశిత పరిష్కారాలను చూపించడం లేదని తెలుసని.. విమానాశ్రయాల్లో అన్ గ్రౌండ్ సేవల పరంగా కొన్ని సందర్భాల్లో మీ అంచనాలను అందుకోలేకపోతున్నట్టు అవగాహన ఉందని లేఖలో పేర్కొన్నారు.
కస్టమర్ల ఫిర్యాదులు తప్పకుండా పరిష్కరిస్తామని విస్తార సీఈవో హామీ ఇచ్చారు. కరోనా వల్ల ఏర్పడిన అసాధారణ పరిస్థితుల్లో కొన్ని సేవలను తాత్కాలికంగా కుదించాల్సి వచ్చినట్టు వివరించారు. వీలైనంత త్వరగా సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
[…] Nayanthara: మెగాస్టార్ చిరంజీవి ఏరి కోరి చేస్తోన్న సినిమా ‘గాడ్ ఫాదర్’. కాగా ఈ గాడ్ ఫాదర్ సినిమా హైదరాబాద్ షెడ్యూల్ పూర్తయింది. డైరెక్టర్ మోహన్‌రాజా ఈ విషయాన్ని వెల్లడించాడు. పైగా నయనతారతో డైరెక్టర్ దిగిన ఫొటోను చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. కాగా ఈ ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. […]
[…] DJ Tillu: యంగ్ టాలెంటెడ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ హీరోగా రిలీజ్ అయిన కొత్త చిత్రం ‘డీజే టిల్లు’. ఇక ఈ సినిమాకి ‘అట్లుంటది మనతోని’ అనేది ఉపశీర్షిక. కాగా ఈ సినిమాలో నేహాశెట్టి కథానాయిక నటించింది. కొత్త దర్శకుడు విమల్ కృష్ణ ఈ సినిమాను చక్కగా డైరెక్ట్ చేయడంతో.. మొదటి షోతోనే ఈ సినిమా హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. హిట్ టాక్ కారణంగా ఈ సినిమాకు అదిరిపోయే ఓపెనింగ్స్ నమోదయ్యాయి. […]