Bappi Lahiri: బాలీవుడ్ లో ప్రముఖ సంగీత దర్శకుడిగా గొప్ప పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న మ్యూజిక్ డైరెక్టర్ బప్పి లహిరి బుధవారం అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. అసలు దిగ్గజ సంగీత దర్శకుడు బప్పి లహిరి అనగానే.. అరుదైన ఆహార్యం.. ఉర్రూతలూగించే గాత్రం గుర్తుకు వస్తాయి. పైగా బప్పి లహిరి జీవిన శైలి కూడా చాలా భిన్నంగా ఉండేది.

బప్పిలహిరి గురించి తెలిసిన వారికీ ఎవరికైనా.. ఆయన పేరు చెబితే ముందుగా ఒంటినిండా ఆభరణాలు, చేతికి పెద్ద కడియం, వేళ్లకు ఉంగరాలు, సన్‌గ్లాసెస్‌తో ఒక ఆహార్యం కళ్లముందు కదలాడుతుంది. బప్పి లహిరి బంగారాన్ని అదృష్టంగా భావించేవారు. అందుకే, ఎప్పుడూ ఒంటి నిండా నగలు ధరించేవారు. దీంతో ఆయనకు Gold Man of Indiaగా గుర్తింపు వచ్చింది.
Also Read: రైతులకు అలర్ట్.. ఈ తప్పు చేస్తే పీఎం కిసాన్ డబ్బులు వచ్చే ఛాన్స్ లేదట!
2014లో బీజేపీ తరఫున పోటీ చేసిన బప్పి లహిరి.. తన వద్ద 754 గ్రాముల బంగారం, 4.62 కేజీల వెండి, భార్య వద్ద 967 గ్రాముల బంగారం, 8.9 కేజీల వెండి ఉందని ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు. 1952 NOV 27న కోల్‌కతాలో జన్మించిన ఆయన అసలు పేరు అలోకేశ్ లహరి. బాలీవుడ్ తోపాటు తెలుగు, తమిళ్, కన్నడలో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు.

డిస్కో డ్యాన్సర్, నమక్ హలాల్ వంటి సినిమాలతోపాటు డర్టీ పిక్చర్‌లో ‘ఉ లాలా.. ఉ లాలా’ సాంగ్‌తో సినీ ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించారు. అయితే.. బప్పిలహిరి అంటే.. పాటలు ఎలా గుర్తుకు వస్తున్నాయో.. ఒంటినిండా ఆభరణాలు, చేతికి పెద్ద కడియం, వేళ్లకు ఉంగరాలు కూడా అలాగే గుర్తుకు వస్తాయి.
Also Read: ఆంధ్రలో థియేటర్లు 100 శాతం ఆక్యుపెన్సీ.. టికెట్ల పెంపు కూడా !
[…] OKtelugu MovieTime : మూవీ టైమ్ నుంచి ప్రజెంట్ టాలీవుడ్ అప్ డేట్స్ విషయానికి వస్తే.. బ్రిటీష్ నటుడు ఎడ్ వెస్ట్విక్‌తో నటి అమీ జాక్సన్ ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. గతేడాది సౌదీలో జరిగిన ఓ ఫిలిం ఫెస్టివల్‌లో వీరిద్దరూ తొలిసారి కలుసుకున్నారని, ఆ పరిచయం డేటింగ్ వరకు వెళ్లిందని వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో ఈమె వ్యాపారవేత్త జార్జ్ పనియోటౌతో సహజీవనం చేసింది. వీరికి ఓ బాబు జన్మించాడు. అయితే మనస్పర్థలు రావడంతో విడిపోయారు. మద్రాసు పట్టణం, ఎవడు, ఐ, రోబో 2.0 చిత్రాల్లో ఈమె నటించింది. […]