https://oktelugu.com/

విశాఖనే క్యాపిటల్‌ సిటీ..: అందుకే ఐటీ పరుగులు

విశాఖ.. రాజధాని ఏ మాత్రం తీసిపోని సిటీ అది. గత ఉమ్మడి ఏపీలోనూ హైదరాబాద్‌ తర్వాతి స్థానం విశాఖదే. విశాఖను ఐటీ రాజధానిగా చేయాలని గతంలోనే వైఎస్సార్‌‌ తలిచారు కూడా. అందులో భాగంగానే ఆయన హయాంలో విశాఖ రుషికొండ వాలీలో ఐటీ క్యాంపస్‌ ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఏపీ సీఎంగా వైఎస్సార్‌‌ తనయుడు జగన్‌మోహన్‌రెడ్డి ఉన్నారు. ఇప్పుడు ఏపీ రాజధానిగా విశాఖను చేయాలని గట్టి పట్టుదలతో ఉన్నారు సీఎం జగన్‌. Also Read: సోము వీర్రాజుకున్న దమ్ము […]

Written By:
  • Srinivas
  • , Updated On : February 5, 2021 / 03:41 PM IST
    Follow us on


    విశాఖ.. రాజధాని ఏ మాత్రం తీసిపోని సిటీ అది. గత ఉమ్మడి ఏపీలోనూ హైదరాబాద్‌ తర్వాతి స్థానం విశాఖదే. విశాఖను ఐటీ రాజధానిగా చేయాలని గతంలోనే వైఎస్సార్‌‌ తలిచారు కూడా. అందులో భాగంగానే ఆయన హయాంలో విశాఖ రుషికొండ వాలీలో ఐటీ క్యాంపస్‌ ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఏపీ సీఎంగా వైఎస్సార్‌‌ తనయుడు జగన్‌మోహన్‌రెడ్డి ఉన్నారు. ఇప్పుడు ఏపీ రాజధానిగా విశాఖను చేయాలని గట్టి పట్టుదలతో ఉన్నారు సీఎం జగన్‌.

    Also Read: సోము వీర్రాజుకున్న దమ్ము వైసీపీ, టీడీపీకి ఉందా?

    ‘అమరావతిలో శాసన రాజధాని పెట్టొచ్చు. ఇక్కడ అసెంబ్లీ నిర్వహించుకోవచ్చు. విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టి…యంత్రాంగం అంతా అక్కడ నుంచి పని చేసుకోవచ్చు. కర్నూలులో హైకోర్టు పెట్టొచ్చు. ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులు ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తోంది’ అని సీఎం జగన్ మోహన్ రెడ్డి 2019, డిసెంబర్ 17న అసెంబ్లీలో చెప్పారు.

    జగన్‌ ప్రోత్సాహం.. కృషితో విశాఖ ఐటీ రాజధానిగా మరింతగా రాణించనుంది. ఆదాని గ్రూప్ విశాఖలో డేటా సెంటర్ పార్క్‌ను ఏర్పాటు చేయనుంది. దీనికి సంబంధించిన పనులు విశాఖలో చురుకుగా సాగుతున్నాయి. బిజినెస్ పార్క్, ఐటీ సంస్థ, స్కిల్ యూనివర్శిటీ, రిక్రియేషన్ సెంటర్లు అన్నీ కూడా విశాఖలో రాబోతున్నాయి. వీటి వల్ల పెద్ద ఎత్తున ఉపాధి ఐటీ పరంగా విశాఖకు లభించే అవకాశాలు ఉన్నాయి.

    Also Read: ఉత్కంఠ: 7న రాష్ట్రపతితో సీఎం జగన్ తో అత్యవసర సమావేశం.. ఏం జరుగనుంది?

    మరోవైపు.. వీటి ఏర్పాటుకు ప్రభుత్వం కూడా 130 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. 14,634 కోట్లతో 82 ఎకరాల్లో డేటా సెంటర్ పార్క్, 11 ఎకరాల్లో స్కిల్ యూనివర్సిటీ, తొమ్మిది ఎకరాల్లో రిక్రియేషన్ కేంద్రం వంటివి ఏర్పాటు కాబోతున్నాయి. తొందరలోనే వీటికి శ్రీకారం చుట్టబోతున్నారు కూడా. మరోవైపు 15వ ఆర్థిక సంఘం విశాఖను ఆర్థిక రాజధాని చేయడానికి మౌలిక సదుపాయాల కల్పన కోసం 1400 కోట్ల రూపాయలను మంజూరు చేయనుంది. మొత్తానికి ఏ విధంగానూ చూసినా విశాఖనే ఏపీకి క్యాపిటల్‌ సిటీ కాబోతోందనేది తేటతెల్లమవుతోంది.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్