కరోనా కల్లోలం మనుషుల్లో ఎంతటి మార్పు తీసుకువచ్చిందో ఈ ఒక్క వీడియో చూస్తే అందరికీ అర్తమవుతోంది. ఓ వైపు దేశంలో కరోనా కల్లోలం.. మందుల కొరత.. వ్యాక్సిన్ల కొరతతో జనాలకు సరిపడా టీకాలు లేక హాహాకారాలు చేస్తున్నారు. మరోవైపు టీకాలను కంపెనీలు , ఆస్పత్రులు బ్లాక్ చేస్తున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి.
అయితే తాజాగా తెలంగాణ ప్రభుత్వం కొన్ని కార్పొరేట్ కంపెనీలకు సామూహిక టీకా పంపిణీకి అవకాశం ఇచ్చాయి. దీంతో హైటెక్స్ లోని ఓ ప్రముఖ కార్పొరేట్ హోటల్ లో టీకా పంపిణీని సదురు ఆస్పత్రి చేపట్టింది.సైబరాబాద్ పోలీసుల అనుమతి కూడా తీసుకుంది. దీంతో ఈ టీకా డ్రైవ్ కు 45 ఏళ్లలో పు యువత పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
క్యూ కిలోమీటర్ దాటిపోయి హోటల్ ను దాటి రోడ్డు మీదకు చేరింది. సామూహిక దూరం పాటిస్తూ టీకా వేయించుకున్నారు. లోపల టీకా వేసే వారు తక్కువగా ఉండడంతో గంటల కొద్దీ క్యూ హోటల్ ఎదుట కనిపించింది.
నిజానికి కొద్దిరోజులుగా ఇదంతా ఆస్పత్రుల్లో చాటుమాటుగా సాగుతోంది.కొన్ని స్టార్ హోటల్స్ లో పదివేల ప్యాకేజీలతో టీకాలు వేయడంపై సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. దీంతో ఇప్పుడు అనుమతులుతీసుకొని కార్పొరేట్ ఆస్పత్రులు టీకాడ్రైవ్ నిర్వహిస్తున్నాయి. ఇలా తొలి డ్రైవ్ కు హైదరాబాద్ లో జనాలు ఎగబడ్డ సీన్ కనిపించింది. కి.మీ ల కొద్ది క్యూలైన్ లో టీకాల కోసం యువత వెయిట్ చేస్తున్న వీడియో వైరల్ గా మారింది.