https://oktelugu.com/

ప్రైవేటుకు టీకాల మళ్లింపు.. పంజాబ్ సర్కారు వెనుకడుగు

టీకాల దందాపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పంజాబ్ సర్కారు ప్రైవేటు హాస్పిటల్స్ కు టీకాల సరఫరా నిలిపివేసింది. ప్రభుత్వం టీకాలు మళ్లించి కోట్లు దండుకుంటున్నట్లు విపక్ష అకాలీదళ్ ఆరోపించింది. సింగిల్ డోస్ వ్యాక్సిన్ ప్రైవేటు హాస్పిటల్స్ ద్వారా సమకూర్చేందుకు పంజాబ్ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీని పై విపక్ష అకాలీదళ్ మండిపడింది. భారీ లాభాలకు కోవాగ్జిన్ టీకాలను మళ్లించిందని ఆరోపించింది. ప్రజల్లో కూడా టీకాల వ్యవహారంపై ఆగ్రహావేశాలు వ్యక్తం కావడంతో సర్కారు తన […]

Written By: , Updated On : June 4, 2021 / 07:50 PM IST
Follow us on

టీకాల దందాపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పంజాబ్ సర్కారు ప్రైవేటు హాస్పిటల్స్ కు టీకాల సరఫరా నిలిపివేసింది. ప్రభుత్వం టీకాలు మళ్లించి కోట్లు దండుకుంటున్నట్లు విపక్ష అకాలీదళ్ ఆరోపించింది. సింగిల్ డోస్ వ్యాక్సిన్ ప్రైవేటు హాస్పిటల్స్ ద్వారా సమకూర్చేందుకు పంజాబ్ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీని పై విపక్ష అకాలీదళ్ మండిపడింది. భారీ లాభాలకు కోవాగ్జిన్ టీకాలను మళ్లించిందని ఆరోపించింది. ప్రజల్లో కూడా టీకాల వ్యవహారంపై ఆగ్రహావేశాలు వ్యక్తం కావడంతో సర్కారు తన ఉత్తర్వులను సాయంత్రానికి ఉపసంహరించుకున్నది.