
సమాజంలో కొన్ని ఘటనలు జనాలను ఆశ్చర్యపరుస్తుంటాయి. దాని వెనుక ఏం జరిగిందో తెలుసుకోకుండా దాన్ని వైరల్ చేస్తుంటారు. అలాంటి ఘటనే ఒకటి మహారాష్ట్రలోని పుణేలో జరిగింది. దెయ్యం పట్టిన బైక్ ఒకటి దూసుకెళ్లిందని ప్రచారం సాగింది. కానీ అసలు కథ తెలిసాక జనాలంతా షాక్ అయిపోయారు.
ఫూణే జిల్లా నారాయణగావ్ లో డ్రైవర్ లేకుండానే రోడ్డుపై జెట్ స్పీడుగా దూసుకెళ్లిన బైక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.ఇది దెయ్యం పట్టిన బైక్ అని.. అలా దూసుకుపోవడం వెనుక దెయ్యం ఉందని నెటిజన్లు సోషల్ మీడియాలో హోరెత్తించారు.
నడిరోడ్డుపై డ్రైవర్ లేకుండా ఓ బైక్ రోడ్డుపై 300 మీటర్ల దూరం ప్రయాణించింది. పుణే-నాశిక్ హైవేపై చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ కావడంతో విషయం వెలుగుచూసింది.
అక్కడున్న జనాలు, బైకర్లు డ్రైవర్ లేకుండా వెళ్లడం చూసి ఆశ్చర్యపోతున్నారు. అయితే ఈ బైక్ అంతకంటే ముందే వేగంగా వ్యక్తి ఒక వ్యక్తిని ఢీకొట్టిందని.. దాన్ని నడుపుతున్న బైకర్ కిందపడిపోయినా బైక్ అలానే దూసుకెళ్లిందని తెలిసింది. కానీ యాక్సిడెంట్ కెమెరాలో రికార్డ్ కాకుండా బైక్ మాత్రమే దూసుకుపోవడంతో ‘దెయ్యం పట్టిన బైక్ ’అంటూ తెగ ప్రచారం జరిగింది. కొద్దిదూరం వెళ్లిన బైక్ ఒక జీపును ఢీకొని పక్కకు పోయి పడడం వీడియోలో చూడొచ్చు.
Driverless Bullet #Narayangaon pic.twitter.com/UNJIwV5Db5
— पॅपिलॉन™ (@Paapiillonn) August 11, 2021