
అమెరికాలోని రిచెస్ట్ సెల్ఫ్ మేడ్ ఉమెన్ పేరుతో తాజాగా విడుదల చేసిన ఫోర్బ్స్ జాబితాలో ఐదుగురు ఇండో అమెరికన్ మహిళలు స్థానం సంపాదించారు. ఈ జాబితాలో అరిస్టా నెట్ వర్క్ సిఈవో జయశ్రీ ఉల్లాల్ 16 వ స్థానంలో నిలిచింది. సింటెల్ ఐటీ కంపెనీ వ్యవస్థాపకురాలు నీర్జా సేథి 26వ స్థానంలో నిలిచారు. కాన్ ఫ్లుడ్ యెంట్ సంస్థ సహ వ్యవస్థాపకురాలు నేహా నార్ఖడే 29వ స్థానంలో ఉన్నారు. జింగో బయోవర్క్స్ సహ వ్యవస్థాపకురాలు రేష్మా శెట్టి 39 స్థానంలో నిలిచారు. పెప్సికో సంస్థ సీఈవో ఇంద్రా నూయి 91 స్థానంలో నిలిచారు.