https://oktelugu.com/

Afghanistan: అప్ఘన్ల ప్రాణభయం.. ఎయిర్ పోర్టులో తొక్కిసలాట.. కాల్పులు

అప్ఘనిస్తాన్ ను తాలిబన్లు చేజిక్కించుకోవడం.. అధ్యక్షుడు అష్రఫ్ విదేశాలకు పారిపోవడంతో అప్ఘనిస్తాన్ ప్రజలు దేశం విడిచి వెళ్లిపోవడానికి ఎయిర్ పోర్టుకు పోటెత్తారు. అప్ఘనిస్తాన్ లోని మంత్రులు, అధికారులు, ఉన్నత వర్గాలంతా ఇప్పుడు అప్ఘనిస్తాన్ లోని కాబూల్ ఎయిర్ పోర్టుకు పోటెత్తారు. విమానాల ద్వారా విదేశాలకు చెక్కేయడానికి పోటీపడుతున్నారు. భారీగా జనాలు రావడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. కాబూల్ ఎయిర్ పోర్టును చేజిక్కించుకున్న తాలిబన్లు గగనతలాన్ని మూసివేశారు. ఏ దేశ విమానాలు, స్వదేశీ విమానాల రాకపోకలను నిషేధించారు. దీంతో కాబూల్ […]

Written By:
  • NARESH
  • , Updated On : August 16, 2021 1:58 pm
    Follow us on

    అప్ఘనిస్తాన్ ను తాలిబన్లు చేజిక్కించుకోవడం.. అధ్యక్షుడు అష్రఫ్ విదేశాలకు పారిపోవడంతో అప్ఘనిస్తాన్ ప్రజలు దేశం విడిచి వెళ్లిపోవడానికి ఎయిర్ పోర్టుకు పోటెత్తారు. అప్ఘనిస్తాన్ లోని మంత్రులు, అధికారులు, ఉన్నత వర్గాలంతా ఇప్పుడు అప్ఘనిస్తాన్ లోని కాబూల్ ఎయిర్ పోర్టుకు పోటెత్తారు. విమానాల ద్వారా విదేశాలకు చెక్కేయడానికి పోటీపడుతున్నారు. భారీగా జనాలు రావడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది.

    కాబూల్ ఎయిర్ పోర్టును చేజిక్కించుకున్న తాలిబన్లు గగనతలాన్ని మూసివేశారు. ఏ దేశ విమానాలు, స్వదేశీ విమానాల రాకపోకలను నిషేధించారు. దీంతో కాబూల్ విమానాశ్రయంలో విమానాలు రాకపోకలు బంద్ అయిపోయాయి. వేల మంది ప్రజలు విమానాల్లో ఎక్కేందుకు పోటీపడుతున్నారు. అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని విమానాల్లోకి తోసుకెళుతున్నారు.

    ముఖ్యంగా కాబూల్ వాసులు, ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారులు, మంత్రులు, మహిళలు ప్రాణభయంతో డబ్బులు, దుస్తులు , విలువైన వస్తువులతో దేశం విడిచి పెట్టేందుకు కాబూల్ విమానాశ్రయానికి పోటెత్తారు. టెర్మినల్స్ అన్నీ కిక్కిరిసిపోయాయి. ప్రజలు ఒక్కసారిగా విమానాల వద్దకు పోటెత్తడంతో భద్రతా సిబ్బంది, అమెరికన్ సైనికులు కాల్పులు జరిపారు. ఇందులో ఐదారుగురు చనిపోయినట్లు తెలిసింది. ప్రజలను కంట్రోల్ చేయలేక గాల్లోకి కాల్పులు జరుపుతున్న పరిస్థితి నెలకొంది.

    ప్రస్తుతం కాబూల్ లో తీవ్ర భయాందోళన నెలకొంది. అటు తాలిబన్లు, ఇటు అమెరికా బలగాలు ఎయిర్ పోర్టులో ఉండి విమానాలను రాకపోకలు లేకపోవడంతో ప్రజలంతా భిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు.ఒక్కో విమానం వద్ద వందల సంఖ్యలో ప్రజలు గుమిగూడారు. రద్దీ విపరీతంగా ఉండడంతో భద్రతా సిబ్బంది చేతులెత్తేశారు. గగనతలం మూసివేయడంతో అమెరికా సహా పలు దేశాల విమానాలు వెనక్కి తమ దేశ పౌరులతో వెళ్లలేని పరిస్థితి నెలకొంది.