Homeజాతీయ వార్తలుViral News : పేరుకే బిలియనీర్.. పిసినారి సంఘానికి అధ్యక్షుడు.. ఇంతకీ ఎవరో తెలుసా...

Viral News : పేరుకే బిలియనీర్.. పిసినారి సంఘానికి అధ్యక్షుడు.. ఇంతకీ ఎవరో తెలుసా ?

Viral News : ప్రతి వ్యక్తి చిన్నప్పటి నుండి విజయం సాధించాలని కలలు కంటాడు, దాని కారణంగా ఆ వ్యక్తి తన యుక్త వయసులో పిసినారిగా ఉంటాడు. తద్వారా తను అనుకున్న లక్ష్యం మేరకు సంపాదించినప్పుడు స్వేచ్ఛగా ఖర్చు చేయగలుగుతాడు. అయితే, కొంతమంది వ్యక్తులు ఇందుకు భిన్నంగా ఉంటారు. కోటీశ్వరులు అయిన తర్వాత కూడా తమ జీవితాలను దుర్భరంగా గడిపేస్తుంటారు. తన ప్రత్యేకమైన జీవనశైలి కారణంగా వార్తల్లో నిలిచిన అలాంటి వ్యక్తి కథ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

ప్రస్తుతం మనం 75 ఏళ్ల జపనీస్ వెటరన్ హిరోటో కిరిటాని గురించి మాట్లాడుతున్నాము. ఇతడిని ప్రపంచం ‘గాడ్ ఆఫ్ ఫ్రీబీస్’ అని పిలుస్తారు. తన వద్ద కోట్ల కొద్ది ఆస్తులు ఉన్నాయి. అయినా హిరోటో కిరిటాని ప్రతిరోజూ కూపన్లు, ఉచిత ఆఫర్‌లను సద్వినియోగం చేసుకుంటూ తన జీవితాన్ని గడుపుతున్నారు. కిరిటాని జపనీస్ చెస్ లాంటి గేమ్ షోగి ప్రొఫెషనల్ ప్లేయర్. అతను స్టాక్ మార్కెట్‌లోని సెక్యూరిటీస్ సంస్థలో ఉపాధ్యాయుడిగా తన వృత్తిని ప్రారంభించాడు. ఇక్కడి నుంచి ట్రేడింగ్‌లో మెలకువలు నేర్చుకున్నాడు. 2024 నాటికి అతని సంపద 60 కోట్ల యెన్‌లకు (రూ. 31.5 కోట్లు) పెరిగింది.

కిరీటాని కూపన్ల మీద తన జీవితాన్ని ఎలా గడుపుతాడు ?
ఇప్పుడు వార్త చదివిన ప్రతి ఒక్కరి మనస్సులో ఒక ప్రశ్న తలెత్తవచ్చు, ఇంత డబ్బు ఉన్నప్పటికీ ఇలా పిసినారిగా ఎందుకు ఉండాల్సి వచ్చింది. 2008 లో స్టాక్ మార్కెట్ క్రాష్ తర్వాత అతను 20 కోట్ల యెన్‌ల నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు ఒక్క పైసా కూడా వృధా కాకూడదని కిరీటాని నిర్ణయించుకున్నారు. దీని కోసం తను 1,000 కంటే ఎక్కువ కంపెనీల షేర్లను కొనుగోలు చేశాడు. తను కూపన్లు, వాటాదారుల ప్రోత్సాహకాలను ఉపయోగించడం ప్రారంభించాడు.

కొన్ని జపనీస్ కంపెనీలు తమ వాటాదారులకు డిస్కౌంట్ కూపన్లు, ఉచిత ఉత్పత్తి నమూనాలు, ఉచిత టిక్కెట్లు, బహుమతులు, బోనస్‌లు, కంపెనీ ఈవెంట్‌లకు హాజరయ్యే అవకాశాన్ని అందిస్తాయి. ఇది కంపెనీ పెట్టుబడిదారుల విధేయతను కొనసాగించడంలో సహాయపడుతుంది. దీన్ని సద్వినియోగం చేసుకొని, కిరీటాని ఉదయాన్నే సైకిల్ తీసుకొని ఉచిత ఆహారాన్ని సేకరించడం ప్రారంభించాడు, అతను జిమ్‌లో ఉచితంగా వ్యాయామం చేస్తాడు. ఉచిత సినిమా టిక్కెట్ల ద్వారా ప్రతి సంవత్సరం 140 సినిమాలు కూడా చూస్తాడు. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, అతను సినిమాలను చూడడు. కానీ అతను థియేటర్లో సౌకర్యవంతమైన సీట్లపై నిద్రపోతాడు. ఇప్పుడు కూపన్‌లను ఉపయోగించడమే తన జీవితానికి సరైన ఉద్దేశ్యం అని కిరీటాని చెబుతుంటారు. సోషల్ మీడియాలో ఆయన లైఫ్ స్టైల్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular