Viral monalisha New Look : ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఎవరైనా పాపులర్ చేస్తుంది అనడంలో మరోసారి తనను తాను ప్రూవ్ చేసుకుంది. ఇటీవల ప్రయాగ్‌రాజ్ కుంభమేళాలో దండలు అమ్మే ఒక అమ్మాయిని స్టార్ ను చేసేసింది. ఆమె పేరు మోనాలిసా. ఆమె ప్రస్తుతం హీరోయిన్ కంటే ఎక్కువ పాపులారిటీ దక్కించుకుంది. రెండు రోజుల క్రితం ఒక ప్రముఖ దర్శకుడు తన చిత్రంలో ఆమెకు ప్రధాన పాత్రను ఆఫర్ చేశాడని వార్తలు వచ్చాయి. తాజాగా ఆమెకు సంబంధించిన కొత్త ఫోటోలు బయటికి వచ్చాయి. మోనాలిసా కొత్త ఫోటోలు ట్విట్టర్‌లో వైరల్ అవుతున్నాయి. ఆమె కొత్త లుక్‌తో చాలా మంది బి-టౌన్ హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తోంది.
ఇది మాత్రమే కాదు, మోనాలిసా మహాకుంభమేళా థ్రెడ్‌పై ఒక పేజీ కూడా క్రియేట్ చేసింది. అక్కడ ఆమెకు సంబంధించిన వీడియోలు, ఫోటోలను కూడా చూడవచ్చు. మోనాలిసా తన కొత్త లుక్‌లో చాలా అందంగా, గ్లామరస్‌గా కనిపిస్తోంది. అయితే, మోనాలిసా సింప్లిసిటీ చాలా ఫోటోలలో స్పష్టంగా కనిపిస్తుంది. ఆమె నీలి కళ్ళు, హెయిర్ స్టైల్, ముత్యాల హారం, పెదవులపై ముదురు లిప్ స్టిక్, ఓపెన్ హెయిర్ హెయిర్ స్టైల్ తో అద్భుతంగా కనిపిస్తోంది. ఫోటోలను చూస్తే మహా కుంభమేళాలో దండలు అమ్ముతూ జీవనం సాగించిన మోనాలిసా ఈమెనా అని సందేహం కూడా రావొచ్చు.
Monalisa#monalisha #trending #mahakumbh #monalishamahakumbh #prayagraj #thedairyofmanipur pic.twitter.com/eHo7Av9b8F
— BK (@6_Bulbul) February 2, 2025
అయితే, ఇప్పుడు మోనాలిసా త్వరలో పెద్ద సెలబ్రిటీగా మారబోతోంది. ఇప్పుడు ఆమెకు ఓ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించే అవకాశం వచ్చింది.మహా కుంభమేళా లో ఇంటర్నెట్ సంచలనంగా మారిన 16 ఏళ్ల అమ్మాయి ఇప్పుడు వెండితెరపై తనదైన ముద్ర వేయబోతోంది.
మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్ జిల్లాకు చెందిన 16 ఏళ్ల మోనాలిసా భోసలే ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా సందర్భంగా తన అద్భుతమైన అందం, ముఖ్యంగా కళ్ల కారణంగా వార్తల్లో నిలిచింది. అయితే, తరువాత ఆమె వేధింపులను ఎదుర్కొన్న కారణంగా తన కుటుంబం ప్రయాగ్‌రాజ్‌ను విడిచి వెళ్ళవలసి వచ్చింది. ఇప్పుడు భోంస్లే రాబోయే చిత్రం ది డైరీ ఆఫ్ మణిపూర్‌లో ప్రధాన పాత్రను పోషించే అవకాశం ఆమెను వెతుక్కుంటూ వచ్చింది. దీనికి ది డైరీ ఆఫ్ వెస్ట్ బెంగాల్‌లో మునుపటి రచనలకు పేరుగాంచిన సనోజ్ మిశ్రా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో రాజ్‌కుమార్ రావు సోదరుడు అమిత్ రావు సరసన మోనాలిసా కథానాయికగా నటిస్తుందని, ఆమె షోబిజ్‌లోకి అడుగుపెడుతున్నారు. ఎప్పుడూ కొత్త ముఖాల కోసం వెతుకుతున్న చిత్ర పరిశ్రమకు కొత్త స్టార్ హీరోయిన్ దొరికిందని అంటున్నారు. ఈ సినిమా గురించి వివరాలు ఇప్పటికీ వరకైతే సీక్రెట్ గా ఉంచుతున్నారు. .
మొత్తంగా, మోనాలిసా కథ ఒక ప్రేరణగా మారింది. మహాకుంభ మేళాలో మాలా అమ్మే అమ్మాయి నుండి ఇప్పుడు పలు అవకాశాలు, ఆశాజనక అవకాశాలు ఆమె ముందుకు వస్తున్నాయి. “మనిషి జీవితం అనేది ఎలా తిరగుతుందో ఎవరు చెప్పగలరు” అన్నట్లుగా ఆమె ప్రస్తుత స్థితి కొంతమేర మారింది.